NTV Telugu Site icon

Parliament Session: నేడు రాజ్యసభ ముందుకు కీలకమైన మూడు బిల్లులు

Parlament

Parlament

పార్లమెంట్‎లో శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య అధినీయం బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అయితే, ఈ మూడు బిల్లులు ఇవాళ రాజ్యసభ ముందు ప్రవేశ పెట్టనున్నారు. అయితే, ఈ సభలో కేంద్ర ప్రభుత్వానికి తగిన బలం లేదు.. దీంతో మెజారిటీ సభ్యుల నుంచి ఆమోదం పొందితేనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు.

Read Also: Bomb Blast: మహబూబాబాద్‌లో అర్ధరాత్రి బాంబ్ బ్లాస్టింగ్.. 25 ఇళ్లకు బీటలు!

ఇక, ఆ తరువాత ఈ మూడు బిల్లులు చట్టంగా మారనున్నాయి. వీటిని ప్రస్తుతం ఉన్న ఐసీసీ, సీఆర్పీసీ చట్టాలలో ప్రత్యేక యాక్ట్‎గా పొందు పర్చారు. ఈ చట్టాలు నేరస్తులను శిక్షించడానికి కాదని.. బాధితులకు న్యాయం జరగడానికని కేంద్రం తెలిపింది. దేశంలో ఏదైనా అసాంఘీక ఘటనలు తలెత్తితే వేగంగా న్యాయం చేసేందుకు ఈ చట్టాలు ఉపయోగపడుతాయని తెలిపారు. డిజిటల్, ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న ఎవిడెన్స్ లను సైతం సాక్ష్యంగా పరిగణలోకి తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏదైనా నేరాలకు పాల్పడి ఇతర దేశాలకు పారిపోతే 90 రోజుల లోపు కోర్టు ముందు లొంగిపోయేలా ఈ చట్టాల్లో పొందుపర్చారు. ఇలా హాజరు కాని పక్షంలో వారి తరఫున ప్రభుత్వ న్యాయవాదిని పెట్టి తీర్పు వెల్లడిస్తారు. అలాంటి వారిని నేరస్తులుగా భావించి ఏ దేశంలో ఉన్నా తీసుకొచ్చి ఉరి శిక్ష వేస్తారు.

Read Also: Sandeep Reddy Vanga: ఏంటీ… ఈ ఇంటర్వ్యూ CGనా? మేము ఒరిజినల్ అనుకున్నామే

అలాగే, ఏదైనా కేసుల్లో దర్యాప్తు సంస్థలు చేపట్టే సోదాల్లో వీడియోగ్రఫీ చేయాలనే విషయాన్ని ఈ చట్టాల్లో పొందుపరిచారు. ఏదైనా తప్పు చేసినప్పటికీ నిరాధారంగా అరెస్ట్ చేసి పోలీ స్టేషన్‌లో పెట్టుకోవడానికి వీలు లేదంటూ వెల్లడించింది. ఆర్ధిక నేరస్తుల ఆస్తులను వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు ఆ డబ్బును మళ్లించేలా కొత్త ప్రతిపాదనను సైతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఏదైనా నేరాల్లో పట్టుబడ్డ వాహనాలను కోర్టు ద్వారా 30 రోజుల్లో అమ్మేయాలనే సంచలన నిర్ణయం తీసుకొచ్చారు. ఏడేళ్ల జైలు శిక్ష పడిన కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తు సంస్థల ప్రమేయం తప్పనిసరి చేస్తూ ఈ మూడు కీలక బిల్లులను మోడీ సర్కార్ ప్రవేశ పెట్టింది.