Site icon NTV Telugu

Jammu Kashmir: బీఎస్‌ఎఫ్ బస్సు కాలువలో పడి ముగ్గురు జవాన్లు మృతి..!

Jammu Kashmir

Jammu Kashmir

జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) బస్సు కాలువలో పడిపోవడంతో ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోంది. పలువురు జవాన్లకు గాయాలయ్యాయి.

Read Also: Pune: చూస్తుండగానే రోడ్డు మధ్యలో దిగిపోయిన డ్రైనేజీ ట్యాంకర్.. వీడియో వైరల్

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల కోసం భద్రతా దళాలు బస్సులో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సులో 35 మంది సైనికులు ఉన్నారు. గాయపడిన సైనికులందరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Minister Nadendla Manohar: ఏపీలో అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

Exit mobile version