Site icon NTV Telugu

Earthquake: మణిపూర్‌లో తెల్లవారుజామున స్వల్ప భూకంపం..

Earthquake

Earthquake

మణిపూర్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున మణిపూర్‌లోని చందేల్‌లో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో.. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Read Also: Tamannaah : అలాంటి సీన్స్ లో నటిస్తే తప్పేంటి.. నటిగా అది నాకు అవసరం..

భూకంప కేంద్రం అక్షాంశం 23.9 N, రేఖాంశం 94.10 E, 77 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు NCS పేర్కొంది. ఆదివారం తెల్లవారుజామున 2:28 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంప ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భూకంప ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే భూకంప తీవ్రత స్వల్పంగానే ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది.

Read Also: Jammu Kashmir : జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం భారీ సెర్చింగ్ నిర్వహిస్తున్న భద్రతాదళాలు

Exit mobile version