Site icon NTV Telugu

NICL AO Recruitment 2025: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో 266 జాబ్స్.. అర్హులు వీరే

Jobs

Jobs

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 266 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో 170 పోస్టులు జనరలిస్ట్ ఆఫీసర్లకు, 96 పోస్టులు స్పెషలిస్ట్‌లకు రిజర్వ్ చేశారు. ఫైనాన్స్, లీగల్, ఐటీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెడిసిన్ (MBBS) వంటి వాటిల్లో భర్తీకానున్నాయి.

Also Read:Vijay Rupani: విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని!

జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తమ రంగానికి సంబంధించిన నిర్దిష్ట అర్హతలను కలిగి ఉండాలి, అంటే మెడికల్ ఆఫీసర్లకు MBBS, ఫైనాన్స్‌కు CA, లీగల్‌కు LLB మొదలైనవి. వయో ప్రమాణాల విషయానికొస్తే, దరఖాస్తుదారులు మే 1, 2025 నాటికి 21- 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read:Bhatti Vikramarka : అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీపడుతుంది

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఫేజ్ I), మెయిన్ ఎగ్జామినేషన్ (ఫేజ్ II), పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,925 ప్రారంభ జీతం ఉంటుంది. SC, ST, PwBD అభ్యర్థులకు రుసుము రూ. 250 గా నిర్ణయించారు. ఇతర అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూలై 03 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version