Site icon NTV Telugu

Bus Catches Fire: రన్నింగ్‌ బస్సులో మంటలు.. 25 మంది సజీవదహనం

Bus Catches Fire

Bus Catches Fire

Bus Catches Fire: మహారాష్ట్రలో ఘోరరోడ్డుప్రమాదం జరిగింది. సమృద్ధి మహామార్గ్ దగ్గర బస్సుకు నిప్పంటుకోవడంతో.. 25 మంది సజీవదహనమయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర నుంచి బస్సు పుణె వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. రన్నింగ్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వేపై బస్సు వెళుతుండగా బుల్దానా వద్ద మంటలు అంటుకున్నాయి.. బస్సు రన్నింగ్‌లో ఉండడంతో క్షణాల్లో బస్సుకు మొత్తం మంటలు వ్యాపించాయి.. దీంతో.. ఆ మంటల్లో చిక్కుకుని 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బుల్దానా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో.. బస్సులో మంటలు చెలరేగాయి.. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉండడంతో ప్రాణనష్టం పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు..

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version