గత కొద్ది రోజులుగా అగ్రరాజ్యం అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మిస్సిస్సిపిలో భారీ గాలులు, ఉరుములు కురుసిన వర్షాలకు 23 మంది మృతి చెందారు. టోర్నడోల ప్రభావంతో 100 మైళ్లకుపైగా నష్టం వాటిల్లింది. షార్కీ, హంఫ్రీస్ కౌంటీలలో రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని మిస్సిస్సిప్పి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కౌంటీలలో సుడిగాలి హెచ్చరికలను జారీ చేసింది. శుక్రవారం అర్థరాత్రి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు కురిసింది. ఇంత తీవ్రతతో సుడిగాలులు తాము ఎప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు.
Also Read:RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…
తుఫాన్ ప్రభావంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. డజన్ల కొద్దీ గాయాలు నమోదయ్యాయని, నలుగురు గల్లంతైనట్లు రాష్ట్ర అత్యవసర విభాగం తెలిపింది. షార్కీ కౌంటీలో 13 మంది మరణించారు. హంఫ్రీస్ కౌంటీలోని సిల్వర్ సిటీలో ఒకరు మరణించినట్లు మిస్సిస్సిప్పి హైవే పెట్రోల్ ట్రూపర్ జోస్ వాట్సన్ తెలిపారు. సిల్వర్ సిటీలో కుటుంబం ఉంటే తప్ప అక్కడికి వెళ్లకుండా దూరంగా ఉండాలని వాట్సన్ ప్రజలను కోరారు. ఆ ప్రాంతం అంతా అస్తవ్యస్తంగా ఉందని, రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలకు ఆకంటంగా మారిందని చెప్పారు. ఇంకా చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో చిక్కుకున్నారని పేర్కొన్నాడు. ప్రజలకు పరిశుభ్రమైన నీరు, ఆహారం అందించడం కూడా కష్టంగా మారిందన్నారు.
