Student Drowns In Ganga: ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్‌లో విషాదం చోటుచేసుకుంది. 21 ఏళ్ల ఐఐటీ రూర్కీ విద్యార్థి ఆదివారం ఇక్కడ నదిలో స్నానం చేస్తూ గంగానదిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌కు చెందిన సిద్ధార్థ్ తన తోటి విద్యార్థులు, ప్రొఫెసర్‌తో కలిసి ఒక ప్రాజెక్ట్ కోసం హరిద్వార్‌కు వెళ్లాడు. వారు చండీ ఘాట్‌లోని దివ్య ప్రేమ్ సేవా మిషన్ ఆశ్రమంలో బస చేశారు.
Gold Chain Robbery: దొరలా వచ్చి గోల్డ్ చెయిన్ కాజేసిన కేటుగాడు
ఐదుగురు విద్యార్థులు ఆదివారం ఉదయం గంగా తీరానికి వెళ్లారని, వారిలో ఇద్దరు స్నానానికి నదిలోకి వెళ్లారని శ్యాంపూర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో వినోద్ థప్లియాల్ తెలిపారు. నదిలో స్నానం చేస్తుండగా, సిద్దార్థ్ ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయాడని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని తెలిపారు. విద్యార్థి మరణంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.