NTV Telugu Site icon

Guinness World Record: 3.13 సెకన్లలో రూబిక్స్ క్యూబ్‌ను సాల్వ్ చేసి గిన్నిస్ రికార్డు.. వీడియో వైరల్

Guinnes World Record

Guinnes World Record

Guinness World Record: కాలిఫోర్నియాలో జరిగిన ప్రైడ్ ఇన్ లాంగ్ బీచ్ 2023 ఈవెంట్‌లో అమెరికాకు చెందిన స్పీడ్‌ క్యూబింగ్ లెజెండ్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హాల్ ఆఫ్ ఫేమర్, మాక్స్ పార్క్ అనే 21 ఏళ్ల యువకుడు 3x3x3 రూబిక్స్ క్యూబ్‌ను అత్యంత వేగంగా పరిష్కరించిన రికార్డును బద్దలు కొట్టారు. జూన్ 11, 2023 తేదీన జరిగిన ఈ ఈవెంట్‌లో అతన అందర్నీ ఆశ్చర్యపరితి గిన్నిస్ రికార్డు సాధించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. 21 ఏళ్ల అతను 2018లో చైనాకు చెందిన యుషెంగ్ డు నెలకొల్పిన మునుపటి రికార్డు కంటే 0.34 సెకన్లు కంటే వేగంగా3.13 సెకన్లలోనే రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించి ఆశ్చర్యకరమైన రికార్డును సాధించాడు.

Also Read: Vande Bharat Train: ఉత్తర తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్- నాగ్‌పూర్ వందేభారత్‌కి గ్రీన్ సిగ్నల్..

దీనికి ముందు మాక్స్ వేగవంతమైన సింగిల్ సాల్వ్ 3.63 సెకన్లు కాగా.. అతను యుషెంగ్ డు (3.47 సెకన్లు) వెనుక రెండవ స్థానంలో నిలిచాడు. మాక్స్ పార్క్ రికార్డ్‌ను బద్దలుకొట్టిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అందులో అతని తోటి క్యూబ్ సహచరులు అతని కోసం ఉత్సాహంగా ఉన్నారు. మాక్స్ అనేక ఇతర స్పీడ్‌క్యూబింగ్ రికార్డులను కలిగి ఉన్నాడు. వాస్తవానికి, అతను దాదాపు అన్నింటిని కలిగి ఉన్నాడు. అతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం 4x4x4 క్యూబ్, 5x5x5 క్యూబ్, 6x6x6 క్యూబ్, 7x7x7 క్యూబ్‌ల కోసం సింగిల్-సాల్వ్, యావరేజ్-సాల్వ్ వరల్డ్ రికార్డ్‌లు రెండింటినీ కలిగి ఉన్నాడు.

Also Read: Chinese Airlines : అధిక బరువు ఉన్న విమాన సిబ్బంది సస్పెండ్.. నిరసన వ్యక్తం చేస్తున్న సిబ్బంది

అతను 4.86 సెకన్ల సమయంతో టైమన్ కొలాసిన్స్కి (పోలాండ్)తో కలిసి 3x3x3 సగటు రికార్డును కూడా కలిగి ఉన్నాడు. దానిని 9 ఏళ్ల యిహెంగ్ వాంగ్ (చైనా) 4.69 సెకన్ల సమయంలో సాధించి 12 మార్చి 2023న బద్దలు కొట్టాడు. అసాధ్యం అనిపించే రికార్డులను బద్దలు కొట్టడం మాక్స్‌కు కొత్తేమీ కాదు. అనుభవజ్ఞుడైన క్యూబర్ ఎరిక్ అక్కర్స్‌డిజ్క్ 7x7x7 సింగిల్ రికార్డ్‌ను బద్దలు కొట్టడానికి తన 1 నిమిషం, 40 సెకన్ల సమయం తాను చూడని అత్యంత అద్భుతమైన విషయం అని చెప్పాడు. మాక్స్ 2022లో 1 నిమిషం 35 సెకన్ల సమయంతో ఆ రికార్డును బద్దలుకొట్టాడు. ఆటిజంతో బాధపడుతున్న మాక్స్‌కు క్యూబింగ్‌ మంచి చికిత్స అని అతని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

 

Show comments