Yamaha Fascino: యమహా ఫాసినో 2026 విడుదల.. యూత్, మహిళల ఫేవరెట్ స్కూటర్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే

  • యమహా ఫాసినో 2026 విడుదల
  • యూత్, మహిళల ఫేవరెట్ స్కూటర్
  • యమహా ఈ అప్‌డేటెడ్ స్కూటర్‌ను రూ.76,500 ఎక్స్-షోరూమ్ ధర
Yamaha Fascino

Yamaha Fascino

యమహా ఫాసినో 125 భారతీయ మార్కెట్‌లో స్టైల్, సౌకర్యానికి ప్రసిద్ధి చెందిన స్కూటర్. 2026లో యమహా దీన్ని కొత్త రిఫ్రెష్‌తో లాంచ్ చేసింది. ప్రధాన మార్పులు రియర్ డిజైన్‌లో ఉన్నాయి. కొత్త టైల్‌లాంప్ సెక్షన్, రీడిజైన్డ్ ఫ్లాషర్లు, Viconic టైల్‌లైట్ డిజైన్, కొత్త డికాల్స్‌తో మరింత ఆకర్షణీయంగా మారింది. మెకానికల్ భాగాల్లో పెద్ద మార్పులు లేవు, కానీ ఓవరాల్ లుక్ మరింత షార్ప్‌గా, కాంపాక్ట్‌గా అనిపిస్తుంది. ఈ అప్‌డేట్ యువత, మహిళలు, రోజువారీ కమ్యూటర్లకు ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది. తక్కువ బరువు, హైబ్రిడ్ టెక్నాలజీ, స్టైలిష్ లుక్‌తో ఫాసినో తన స్థానాన్ని కొనసాగిస్తోంది.

Also Read:Roja: రోజా ఈజ్ బ్యాక్.. మళ్ళీ బుల్లితెరపై‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ షురూ!

ఈ స్కూటర్ డిజైన్‌లో కొన్ని మార్పులు చేశారు, దీని ఫలితంగా వెనుక భాగం మెరుగ్గా, టెయిల్‌లైట్ సవరించినట్లుగా వచ్చింది. ఈ స్కూటర్‌ను 125cc ఇంజన్‌తో అందిస్తున్నారు. ఇది 6 kW పవర్, 10.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీనికి CVT గేర్‌బాక్స్ జత చేశారు. యమహా ఈ అప్‌డేటెడ్ స్కూటర్‌ను రూ.76,500 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది. టాప్ వేరియంట్ ధర రూ.95,200 (ఎక్స్-షోరూమ్).

Also Read:Thiruveer : సినిమాల కారణంగా అమ్మా నాన్న కర్మకాండలు చేయలేకపోయా.. తిరువీర్ గుండెల్లో ఎప్పటికీ మాయని గాయం

ఫీచర్లు

యమహా ఫాసినో స్కూటర్‌ను టెలిస్కోపిక్ సస్పెన్షన్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, సీటు కింద 21 లీటర్ల స్టోరేజ్, TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్ -బై- టర్న్ నావిగేషన్, ఆన్సర్-బ్యాక్ ఫంక్షన్, స్మార్ట్ మోటార్ జెనరేటర్ (SMG), సైలెంట్ స్టార్ట్, స్టాప్ & స్టార్ట్ సిస్టమ్ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లతో అందిస్తోంది. మొత్తం మీద, 2026 యమహా ఫాసినో 125 స్టైల్, సౌకర్యం, ఎఫిషియన్సీ కలిపి ఇచ్చే ఉత్తమ ఎంపిక.