Bhagyashri Borse : ఈ ఏడాదైనా భాగ్యశ్రీ ఖాతాలో హిట్ పడేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లామర్, ఫెర్ఫామెన్స్ చూపిస్తున్నా భాగ్యశ్రీ బోర్సేకు హిట్ భాగ్యం దక్కడం లేదు. మిస్టర్ బచ్చన్‌లో నడుమ అందాలతో కుర్రకారును గిలిగింతలు పెట్టి ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారింది ఈ ముంబయి భామ. ఈ గ్లామర్ షోతో మేడమ్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారంతా.. నిజంగా చేసిన సినిమాల్లో ఒక్కటి హిట్ పడినా అలాగే అయ్యేదేమో కానీ.. బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు ఎక్కడా అడుగుపెట్టినా విజయ లక్ష్మీ.. ఈ మహాలక్ష్మీపై కటాక్షం చూపించడం లేదు.
Also Read : Peddi : ఏంది ‘పెద్ది’ ఇది.. ఇలా అయితే ఎలా?
Also Read
- Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
- Imran Tahir: "ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్.." 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. ఇమ్రాన్ తాహిర్ రికార్డు.!
- iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్?
2025లో భాగ్యశ్రీ హవా చూసి పక్కా హిట్ కొడుతుందని అనుకున్నారు.. కట్ చేస్తే ఊహించని విధంగా వరుస డిజాస్టర్స్ చవిచూసింది. విజయ్ దేవరకొండ కింగ్ డమ్‌పై ఎన్నో అంచనాలు పెట్టుకుంటే దెబ్బేసింది. దుల్కర్ సల్మాన్ కాంతలో కోలీవుడ్ తెరంగేట్రం చేసిన మహాలక్ష్మీ… డీ గ్లామర్ రోల్‌తో ఆకట్టుకున్నా నో యూజ్. రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకాలో పక్కా తెలుగింటి ఆడపడుచులా కనిపించినా సక్సెస్ రాలేదు. ఇక ఆమె ఖాతాలో ఉన్న ఫిల్మ్ లెనిన్. ఏజెంట్ ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత అక్కినేని వారసుడు అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ లెనిన్. అఖిల్ సరసన తొలుత శ్రీలీల ఫిక్స్ కాగా, ఆమె తప్పుకోవడంతో భాగ్యశ్రీ వచ్చి చేరింది. రీసెంట్లీ రిలీజ్ చేసిన వారెవ్వా సాంగ్‌లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందన్న కామెంట్స్ వినిపించాయి. తాజాగా వచ్చిన ఎట్టా ఎట్టా సాంగ్‌లోనూ అదరగొట్టేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ 26న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. లెనిన్ తప్పా.. మరో సినిమా భాగ్యశ్రీ కమిటైన దాఖలాలు లేవు. కానీ మేడమ్ సక్సెస్ ఖాతానే ఓపెన్ చేయికపోయినా క్రేజ్‌తో ఆఫర్స్ కొల్లగొట్టేస్తోంది. శివకార్తీకేయన్‌తో ఓ తమిళ్ ప్రాజెక్ట్స్ సైన్ చేసినట్లు సమాచారం. అలాగే హిందీలో రణవీర్ సింగ్ ప్రళయ్ కోసం ఈ భామ పేరునే పరిశీలిస్తున్నట్లు బజ్. ఇక ఇప్పటి వరకు హిట్టే చూడని భాగ్యానికి.. లెనిన్ ఆఫర్స్ క్యూ కట్టే ఫిల్మ్ అవుతుందా…? అఖిల్ కంబ్యాక్ మూవీగా మారుతుందా?
తాజావార్తలు
-
Tilak Varma: టీమిండియాలో ఆడుతున్నా సంతోషంగా లేను.. చిన్నప్పటి నుంచి నా టార్గెట్ అదే!
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Suriya : ఒకే ఏడాది 3 సినిమాలు.. సూర్య కొత్త రికార్డ్
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
-
Mayawati’s Big Decision: మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై మాయావతి వేటు.. బీఎస్పీ నుంచి పూర్తిగా బహిష్కరణ
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..