Site icon NTV Telugu

2025 Yezdi Adventure: ఫీచర్లు, డిజైన్‌లో భారీ మార్పులతో యెజ్డీ అడ్వెంచర్ లాంచ్..!

2025 Yezdi Adventure

2025 Yezdi Adventure

2025 Yezdi Adventure: క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) పరిధిలో పనిచేస్తున్న యెజ్డీ మోటార్‌సైకిల్స్ (Yezdi Motorcycles) ఈ బ్రాండ్ తాజాగా భారత మార్కెట్‌లో 2025 Yezdi Adventure మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వర్షన్‌ లో బైక్‌ కు పూర్తిగా కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్లు లభించగా.. మెకానికల్ గా మాత్రం గత మోడల్‌ లాగానే కొనసాగుతోంది. మరి ఈ కొత్త బైకులో ఎటువంటి ఫీచర్లను తీసుకవచిందో ఒకసారి చూద్దామా..

Read Also: Motorola edge 60: 50MP ట్రిపుల్ కెమెరా, IP68 + IP69 రెసిస్టెంట్‌తో లాంచ్ కాబోతున్న మోటరోలా ఎడ్జ్ 60..!

2025 మోడల్ ఇప్పుడు పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తోంది. దీనివల్ల బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఆధునిక ఫీచర్లు లభించనున్నాయి. అదనంగా USB చార్జింగ్ పోర్ట్, అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్, అలాగే ఈ సెగ్మెంట్‌లోనే మొట్టమొదటిగా త్రై-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ లతో అందుబాటులో ఉంది. మెకానికల్‌గా చూస్తే, ఈ బైక్‌ 334cc Alpha 2 లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో వస్తోంది. ఇది 29 HP పవర్, 29.9 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా పని చేస్తుంది. ఇక సస్పెన్షన్ సెటప్‌లో ముందు భాగంలో 41mm టెలిస్కోపిక్ ఫోర్క్ (గేటర్స్‌తో), వెనుక భాగంలో మోనోషాక్ వుంటుంది. బ్రేకింగ్ డ్యూటీలను ఫ్లోటింగ్ కేలిపర్స్‌ తో కూడిన డిస్క్ బ్రేకులు నిర్వహిస్తాయి.

Read Also: REDMAGIC Tablet 3 Pro: 8200mAh బ్యాటరీ, గేమింగ్‌కి హై స్పీడ్ గ్యారంటీతో రాబోతున్న REDMAGIC టాబ్లెట్..!

2025 Yezdi Adventure బైక్‌కు ముందు భాగంలో BMW F 800 GS మోడల్‌ను పోలిక వచ్చేలా అసిమెట్రికల్ LED హెడ్లైట్ సెటప్ లభిస్తోంది. దీనికి తోడు కొత్త విండ్ స్క్రీన్, ర్యాలీ-స్టైల్ బీక్ ఉండటం గమనించవచ్చు. ట్యాంక్ డిజైన్ పాత మాదిరిగానే ఉన్నా, కొత్త గ్రాఫిక్స్‌తో అదనపు ఆకర్షణగా నిలవనుంది. అడ్వెంచర్ లెటరింగ్ బైక్ సైడ్ ప్యానెల్‌పై ఉంటుంది. కొత్త పెయింట్ స్కీమ్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక వెనుక భాగంలో, స్టెప్-అప్ సీట్ బైక్ చివరి భాగంతో స్మూత్‌గా కలుస్తుంది. ఇందులో ట్విన్ LED టెయిల్ లైట్ సెటప్ ఉంటుంది. అంతేకాకుండా, అప్స్వెప్టెడ్ ఎగ్జాస్ట్, డ్యూయల్ పర్పస్ టైర్లు, వైర్-స్పోక్ వీల్స్ బైక్‌కు అడ్వెంచర్ రైడింగ్ స్టైల్‌ను కలిగిస్తున్నాయి. 220mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో కూడిన కొత్త బాష్ ప్లేట్ కూడా ఇందులో భాగమైంది.

ఇక 2025 Yezdi Adventure ధర రూ. 2.15 లక్షల నుంచి రూ. 2.27 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. కొత్త డిజైన్, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో ఇది ఇప్పటికే ఉన్న అడ్వెంచర్ బైక్ మార్కెట్‌లో పోటీతత్వాన్ని మరింత ఉధృతం చేయనుంది. డ్రామాటిక్ లుక్స్, స్ట్రాంగ్ బిల్డ్, అధునాతన ఫీచర్లు కలిపి, యెజ్డీ బైక్‌ను ట్రావెల్, అడ్వెంచర్ లవర్స్‌కి మంచి ఆప్షన్‌గా నిలబెట్టాయి.

Exit mobile version