Site icon NTV Telugu

Kawasaki Z900: కొత్త ఇంజిన్, మోడర్న్ లుక్స్‌తో వచ్చేసిన 2025 కవాసాకి Z900..!

Kawasaki Z900

Kawasaki Z900

Kawasaki Z900: కవాసాకి భారతదేశంలో తమ కొత్త మోడల్ 2025 Kawasaki Z900 బైక్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ లో పలు ఆధునిక ఫీచర్లు, మెరుగైన ఎలక్ట్రానిక్స్, స్టైలిష్ డిజైన్, తాజా Euro 5+ ఎమిషన్ నిబంధనలకి అనుగుణంగా ఈ బైక్‌ను నవీకరించారు. మరి ఈ కొత్త బైక్ ఫీచర్లను వివరంగా చూద్దామా..

పవర్‌ట్రైన్:
ఈ బైక్‌లో గత మోడల్‌లో ఉన్న ఇంజనే కొనసాగుతుంది. దీని లోని 948cc, ఫోర్-సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 125 హెచ్‌పీ పవర్, 98.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ కు జత చేయబడింది.

Read Also: IPL 2025 Final Live Updates: పంజాబ్ vs ఆర్సీబీ మధ్య హైఓల్టేజ్‌.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లైవ్‌ అప్‌డేట్స్..

డిజైన్:
2025 Z900 బోల్డ్ అదిరిపోయే డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఇది Z500 బైక్ మోడల్ డిజైన్ నుంచి ప్రభావితం అయింది. హెడ్‌ ల్యాంప్ సెటప్ అదే తరహాలో ఉండగా, సీటింగ్ ప్యాడింగ్ మెరుగుపరిచారు. అయినా సరే, రైడర్ ట్రయాంగిల్ డిజైన్‌ను మునుపటి విధంగానే కొనసాగించారు.

భద్రతా ఫీచర్లు:
ఈ బైక్‌లో 5-అక్సిస్ ఇనర్షియల్ మేజర్‌మెంట్ యూనిట్ (IMU) ఉంది. ఇది రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ ఇంకా డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్‌కు సహాయపడుతుంది. బ్రేకింగ్ వ్యవస్థలో నిస్సిన్ కాలిపర్స్, 300mm డ్యుయల్ ఫ్రంట్ డిస్కులు ఇచ్చారు. పాత Dunlop Sportmax Roadsport 2 టైర్ల స్థానంలో ఇప్పుడు Dunlop Sportmax Q5A హై-పర్‌ఫార్మెన్స్ టైర్లు ఉపయోగించారు.

Read Also: IPL 2025 Final: హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. మొదట బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబి..!

ఈ బైక్ లో 5-ఇంచ్ TFT డిస్‌ప్లే బ్లూటూత్ ఫీచర్‌తో లభిస్తుంది. ఇది Kawasaki Rideology యాప్ ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లకు సహాయపడుతుంది. రైడ్ బై వైర్ థ్రాటిల్ వ్యవస్థ ద్వారా క్రూయిజ్ కంట్రోల్, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ ఫీచర్లు అందించబడుతున్నాయి. దీని ప్రారంభ ధరను కంపెనీ రూ. 9.52 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది.

Exit mobile version