NTV Telugu Site icon

2023 July Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. జులైలో ఒక శనివారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి!

Bank Holidays

Bank Holidays

List Of Bank Holiday in July 2023: జూలై నెలలో ఇప్పటికే 10 రోజులు పూర్తయ్యాయి. ఇంకా 21 రోజులు మిగిలి ఉన్నాయి. అయితే ఈ నెలలో మిగిలి ఉన్న శని వారాల్లో కేవలం ఒక్క శనివారం మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. మిగతా శని వారాల్లో అన్ని బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. బ్యాంకు కస్టమర్లు ఈ విషయాన్ని ముందే తెలుసుకుంటే.. ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. మిగతా శని వారాల్లో బ్యాంకులు ఎందుకు క్లోజ్‌గా ఉంటాయో తెల్సుకుందాం.

దేశంలో ఆదివారం బ్యాంకులు పని చేయవు అన్న విషయం తెలిసిందే. రెండు, నాలుగు శని వారాల్లో కూడా బ్యాంకులు పని చేయవు. ఇక జూలై నెలలో ఇప్పటికే రెండు శని వారాలు పూర్తయ్యాయి. ఇంకా మూడు శని వారాలు మిగిలి ఉన్నాయి. ఈ మూడింటిలో బ్యాంకులు ఒక శనివారం మాత్రమే పని చేస్తాయి. జూలై నెలలో ఐదవ శనివారం (జూలై 29) మొహర్రం పండగ ఉంది. ఆ రోజున బ్యాంకులు పని చేయవు. నాలుగవ శనివారం జూలై 22న ఉంది కాబట్టి ఆ రోజు కూడా బ్యాంకులకు హాలిడే. ఇక వచ్చే శనివారం (జూలై 15) మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. ఏమైనా పని ఉంటే.. వచ్చే శనివారం చూసుకుంటే సరిపోతుంది.

ఈ నెలలో బ్యాంకులకు సంబంధించి ముఖ్యమైన పనులు ఉంటే.. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోండి. ఏటీఎం, క్యాష్ డిపాజిట్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు నిత్యం కొనసాగుతూనే ఉంటాయి. జూలై నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గత నెలలోనే ప్రకటించింది. ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులతో కలిపి ఈ నెలలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు వచ్చాయి.

Also Read: Maruti Suzuki Offers: మారుతి కార్లపై భారీ డిస్కౌంట్స్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!

జూలై 2023లో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే:
# జూలై 2: ఆదివారం
# జూలై 5: గురు హరగోవింద్ సింగ్ జయంతి (జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులకు హాలీ డే)
# జూలై 6: ఎంహెచ్‌ఐపీ డే (మిజోరాం రాష్ట్రంలో సెలవు)
# జూలై 8: రెండో శనివారం
# జూలై 9: ఆదివారం
# జూలై 11: కేర్ పూజ (త్రిపుర రాష్ట్రంలో బ్యాంకులు బంద్)
# జూలై 13: భాను జయంతి(సిక్కింలో బ్యాంకులు క్లోజ్)
# జూలై 16: ఆదివారం
# జూలై 17: యు టిరోట్ సింగ్ డే మేఘాలయలో బ్యాంకులకు సెలవు)
# జూలై 22: నాలుగో శనివారం
# జూలై 23: ఆదివారం
# జూలై 28: అషూరా (జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులకు హాలీ డే)
# జూలై 29: మొహర్రం (అన్ని రాష్ట్రాల్లో)
# జూలై 30: ఆదివారం
# జూలై 31: అమరవీరుల దినోత్సవం (హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో సెలవు)

Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

Show comments