NTV Telugu Site icon

Ind vs Pak: వామ్మో.. ఒక్క టికెట్ ధర 17 లక్షలు.. ఇండో – పాక్ మ్యాచ్ ..

Ind Vs Pak

Ind Vs Pak

భారత్‌ – పాకిస్థాన్‌ మధ్య జరుగనున్న క్రికెట్‌ మ్యాచ్‌ రాబోయే ప్రపంచ కప్ లో హెలైట్ గా నిలచబోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక క్రికెట్ అభిమానులు ఈ ఆటను ప్రత్యక్షంగా చూడటానికి బారులు తీరుతున్నారు. నిజానికి ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు జరగట్లేదు.

Liquor Truck Overturns: మద్యం లారీ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ ప్రజలు..

కాకపోతే అప్పుడప్పుడు ఈ రెండు జట్లు ఐసీసీ టోర్నీల్లో తలపడుతున్నాయి. ఇకపోతే వచ్చే నెలలో అమెరికాలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇక ఇందులో జూన్ 9న భారత్‌ – పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్ జరుగుతుండడంతో పూర్తిగా క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక మ్యాచ్ టికెట్స్ భారీ ధరకు అమ్ముడవుతాయి. ఇందులో భాగంగానే ఒక టిక్కెట్టు 20,000 డాల్లర్స్ కి అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక్కో టిక్కెట్టు మన దేశ కరెన్సీలో దాదాపు 17 లక్షలు. అయితే ఇందుకు గాను ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ అధిక ధరలకు టిక్కెట్లను విక్రయించడాన్ని ఖండిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Sonia Gandhi: ‘‘ మీ ప్రతీ ఓటు..’’ ఢిల్లీ ఓటర్లకు సోనియా గాంధీ సందేశం..

న్యూయార్క్‌ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆటకు సంబంధించిన టిక్కెట్లు అధిక ధరలకు అమ్ముడవుతున్నాయా, ఇది క్రికెట్ ఆటకు సహాయపడుతుందా లేదా ఆటంకమా అని లలిత్ మోడీ ప్రశ్నించారు. 20,000 డాలర్లకు విక్రయిస్తున్న డైమండ్ క్లబ్ టిక్కెట్లు షాకింగ్‌గా ఉన్నాయని ఆయన అంటున్నారు. లాభాపేక్షతో కాకుండా క్రికెట్‌ను ప్రోత్సహించేందుకే అమెరికాలో ప్రపంచకప్ నిర్వహిస్తామని లలిత్ మోదీ అన్నారు. పలు వెబ్‌సైట్లు క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఐసీసీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.