Site icon NTV Telugu

Turkey Earthquake: టర్కీలో వరుస భూకంపాలు.. 2వేల ఏళ్లనాటి కోట ధ్వంసం

Kota

Kota

Turkey Earthquake: టర్కీ, సిరియాను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఇటీవల సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికి తేరుకోలేకపోతున్న టర్కీని మరో భూకంపం వణికించింది. టర్కీలోని కహ్రామన్మరాస్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.7గా నమోదైంది. దీంతో అక్కడి స్థానికులు భయబ్రాంతులకు లోనయ్యారు. టర్కీ, సిరియాలో మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ భూకంప మృతుల సంఖ్య 37 వేలు దాటింది. ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మరిన్ని మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దాంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. సహయక చర్యలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి.

Read Also: Demolition Drive: అధికారుల అత్యుత్సాహం.. తల్లీకూతుళ్ల సజీవదహనం

టర్కీలో ఇంతవరకు 29,606 మంది చనిపోగా, సిరియాలో 3,576 మంది మృత్యువాతపడ్డారు. ఈ రెండు దేశాల్లో సంఖ్య 50వేలు దాటేస్తుందని ఐక్యరాజ్య సమితి సహాయక కార్యక్రమాల విభాగాధిపతి మార్టిన్ గ్రిప్లిక్స్ తెలిపారు. భూకంపం ధాటికి టర్కీలో 88 వేల మంది క్షతగాత్రులు అయ్యారు. సిరియాలో 12 వేల మంది క్షతగాత్రులు అయ్యారు. సిరియాలో 50 లక్షలకు పైగా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇదిలావుంటే ఈ భారీ భూకంపం దెబ్బకు 2000 ఏళ్ల క్రితం నాటి కోట ధ్వంసమైంది. అప్పట్లో రోమన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న తుర్కియేలోని గజియాన్‌టెప్‌ కోట ఇప్పటికే శిథిలావస్థలో ఉండేది. తాజా భూకంపం పుణ్యమా అని ఆ కోట దాదాపు పూర్తిగా ధ్వంసమైంది.

Exit mobile version