20 Weds 70: ప్రేమ గుడ్డిది. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాము. కులం, మతం, అందం, డబ్బు, హోదా ఇలా తేడా లేకుండా పుట్టేదే ప్రేమ. అయితే కొంతమంది ప్రేమికులను చూస్తే చాలామందికి ఈర్ష కూడా కలుగుతుంది. కొన్నిసార్లు యువతులు వారు ప్రేమించే అబ్బాయి ప్రయోజకుడు కాదా అనే విషయాలు తెలుసుకోకుండా ప్రేమించేస్తుంటారు. మరికొందరైతే యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు వృద్ధుల పట్ల ఆకర్షితుల అవడం చాలా అరుదుగా కనపస్తుంటుంది. తాజాగా ఓ 70 ఏళ్ల వృద్ధుడు 20 ఏళ్ల అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో సంబంధించిన వివరాలు చూస్తే..
IND vs BAN Playing 11: ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. కుల్దీప్, అక్షర్‌లకు నిరాశే!
వైరల్ గా మారిన వీడియోలో 70 ఏళ్ల వృద్ధుడు 20 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకోవడం కనిపిస్తుంది. ఆ వివాహ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులకు కూడా ఉన్నారు. వీడియోలో అమ్మాయి పెళ్లి దుస్తుల్లో కనపడగా.. వరుడు వృద్ధుడు తెల్లటి కుర్తా పైజామా ధరించి కనిపిస్తాడు. అమ్మాయి మొదట వరుడు అమ్మాయి మెడలో పూలమాల వేయగా., ఆపై వధువు కూడా ఎంతో సంతోషంగా వరుడికి పూలమాల వేస్తుంది. దాంతో ఇరువురి కుటుంబ సభ్యులు వారిపై పూల వర్షం కురిపించారు. దాంతో వధూవరులు ఇద్దరు సంతోషంగా కనబడడం మనం వీడియోలో గమనించవచ్చు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
यह सब क्या देखना पड़ रहा है ☹️ pic.twitter.com/1woN1IIGv5
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 26, 2024
ప్రేమ గుడ్డిదే అనుకున్నాం కానీ.. మరీ ఇంత దారుణంగా అనుకోలేదని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు అమ్మాయి తరఫు వారు డబ్బుకు ఆశపడి ఇలా చేసి ఉండవచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇరువురి జీవన ప్రయాణం సజావుగా సాగాలని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూసి ఏమనిపించిందో ఒక కామెంట్ చేయండి.