జార్ఖండ్‌లోని ఓ పాఠశాలలో అపశృతి చోటుచేసుకుంది. స్కూల్ ట్యాంక్ నుంచి వచ్చిన నీరు తాగి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న లతేహర్ జిల్లాలోని దురులోని అప్‌గ్రేడ్ ప్రైమరీ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే పాఠశాల సిబ్బంది.. హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించారు. చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: GST : ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం..వీటిపై పన్ను మినహాయింపు
మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం పిల్లలు పాఠశాలలోని ట్యాంక్‌లోని నీరు తాగేందుకు వెళ్లారు. కొంత సమయం తర్వాత చాలా మంది విద్యార్థులు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. 20 మంది విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారని పాఠశాల ఉపాధ్యాయుడు తెలిపారు. నీటిలో దుర్వాసన వస్తోందని కొందరు విద్యార్థులు తెలిపారు. విద్యార్థులను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి పరీక్షలు నిర్వహించారు. ఇక నీటి శాంపిల్‌ను పరిశీలించేందుకు తీసుకున్నట్లు చాంద్వా బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ చందన్ కుమార్ తెలిపారు. చందన్ కుమార్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: Sumit Nagal : మరోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన టెన్నిస్ స్టార్..