NTV Telugu Site icon

Dogs Shootout: పెంపుడు కుక్కని చంపడంతో.. 20 వీధి కుక్కలను అతి కిరాతకంగా..?

12

12

మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్‌ గ్రామంలో ఓ వ్యక్తికి శునకాలంటే బహు ప్రీతి. ఈ ఇష్టంతోనే ఆయన 2 పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితం వీటిపై వీధి కుక్కలు దాడి చేసి అందులో ఒకదాన్ని చంపేయగా., మరొక దానిని గాయపరిచాయి. ఈ విషయాని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి ఎలాగైనా సరే వీధి కుక్కలని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ పెద్ద పథకమే వేసాడు. ఇందులో భాగంగానే తన స్నేహితులతో కలిసి ఆ వ్యక్తి తుపాకీ సహాయంతో ఏకంగా 20 వీధి కుక్కలను చంపేశాడు. ఈ అమానవీయ సంఘటన నెల రోజుల క్రితం జరగ్గా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: Cheapest Diesel Car: చౌకైన డీజిల్ కారు.. 20 కిమీ కంటే ఎక్కువ మైలేజ్!

ఇందుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసు మేరకు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ వివరాలను తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌ నగర్‌ మండలం దేవునిపల్లికి చెందిన మంద నర్సింహారెడ్డి హైదరాబాద్‌ లోని రెడ్‌హిల్స్‌ లో నివాసం ఉంటున్నాడు. ఈయనకి ఫలక్‌నుమాకు చెందిన తారీఖ్‌ అహ్మద్‌, మహ్మద్‌ తాహెర్‌ ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అయితే నర్సింహారెడ్డి అత్తగారిది అడ్డాకుల మండలం పొన్నకల్‌ గ్రామం. వారి ఇంట్లో డాక్స్‌హుండ్‌ జాతి రకం పెంపుడు కుక్కలు ఉన్నాయి.

Also Read: Water Supply: నేడు నగరంలో నీటి సరఫరా బంద్..

ఈ కుక్కలని వీధికుక్కలు ఒకదాన్ని కరిచి చంపడంతోపాటు.. మరోదాన్ని గాయపరిచాయి. దాంతో వాటిపై కోపం పెంచుకున్న నర్సింహారెడ్డి ఫిబ్రవరి 15న తన కారులో మిత్రులతో కలిసి పొన్నకల్‌ గ్రామానికి చేరుకున్నాడూ. ఈ క్రమంలో అదే రోజు అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో తారిఖ్‌ అహ్మద్‌ వద్ద ఉన్న లైసెన్స్‌ రివాల్వర్ తో గ్రామంలో కనిపించిన కుక్కలన్నింటినీ కాల్చుకుంటూ వెళ్లారు. ఈ దెబ్బకి గ్రామంలోని 20 మూగజీవాలు మృతివాత పడ్డాయి. దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు బెంజ్‌కారులో వచ్చారని నిర్ధారనాకు వచ్చారు. ఇక ఈ కేసులో నిందితుల నుంచి 0.22 రైఫిల్‌, 6 సెల్‌ఫోన్లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.