NTV Telugu Site icon

Planes Collide: గాలిలో ఢీకొన్న సైనిక విమానాలు.. ఇద్దరు పైలట్లు మృతి

Planes Collide

Planes Collide

Planes Collide: ఇటలీలోని రోమ్‌కు వాయువ్య దిశలో శిక్షణా విన్యాసాల సందర్భంగా ఇటాలియన్ వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు గాలిలో ఢీకొన్నాయి. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్‌లు మరణించారని ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని చెప్పారు. ఇద్దరు పైలట్లు U-208 శిక్షణా విమానాల్లో ఉన్నారు. వారు శిక్షణా మిషన్‌లో పాల్గొంటున్నారని వైమానిక దళ పత్రికా ప్రకటన తెలిపింది. ఢీకొనడానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు.

Read Also: Explosion: ఢాకాలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం, 100 మందికి గాయాలు

గైడోనియా సమీపంలో శిక్షణ విమానాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వైమానిక దళ పైలట్ల మరణాల గురించి విన్నప్పుడు తాము చాలా బాధపడ్డామని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వాపోయారు. పైలట్ల కుటుంబాలకు, వైమానిక దళ సభ్యులకు ప్రధాని సంతాపం తెలిపారు. యూ-208 అనేది ఒక తేలికపాటి, ఒకే-ఇంజిన్ గల విమానం. ఇది నలుగురు ప్రయాణీకులు, పైలట్‌తో పాటు 285 కిమీ (177 mph) గరిష్ట వేగంతో ప్రయాణించగలదు.

 

Show comments