NTV Telugu Site icon

Delhi : చేంజ్ లేదు సర్.. డెలివరీ ఏజెంట్స్ పై కస్టమర్స్ దాడి

Delhi

Delhi

డెలివరీ ఏజెంట్స్ తగిన చిల్లర లేదనే కారణంతో కస్టమర్స్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ పరిధిలో శుక్రవారం జరిగింది. బ్లింకిట్ అనే గ్రాసరీ డెలివరీ సంస్థలో అమన్, గుర్పాల్ సింగ్ డెలివరీ ఏజెంట్స్ గా పని చేస్తున్నారు. వీరు శుక్రవారం రోజున రాజౌరి గార్డెన్ పరిధిలోని తరుణ్ సూరి అనే కస్టమర్ ఇంటికి సరుకులు డెలివరీ చేసేందుకు వెళ్లారు. దీనికి రూ. 1,655 బిల్ అయింది. ఆ బిల్లు చెల్లించిన తర్వాత కస్టమర్ కు తిరిగి ఇవ్వడానికి సరిపడా చిల్లర అమన్, గుర్పాల్ సింగ్ వద్ద లేదు.. దీంతో చిల్లర లేదనే కారణంతో డెలివరీ ఏజెంట్స్ తో తరుణ్ అనుచితంగా వ్యవహరించాడు. ఆ తర్వాత వారిపై దాడికి పాల్పడ్డాడు.

Also Read : Atchannaidu: 2024లో పసుపు జెండా ఎగరేస్తాం

అంతేకాకుండా.. తరుణ్ కు సంబంధించిన మరో నలుగురు వ్యక్తులు కూడా డెలివరీ ఏజెంట్స్ పై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలో గాయపడ్డ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక డీసీసీ గంధ్వమ్ బన్సల్ నిందితులపై కేసు నమోదు చేశారు. 295ఏ, 323, 341,427 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసుపై విచారణ జరుగుతుందన్నారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఆ డెలివరీ ఏజెంట్స్ ఇద్దరూ తమ ఇంట్లోని ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారని తరుణ్ ఆరోపించాడు. కాగా, తమ సంస్థ డెలివరీ ఏజెంట్స్ పై దాడి చేసిన ఘటనపై బ్లింకిట్ స్పందించింది. బాధిత డెలివరీ ఏజెంట్స్ కు అన్ని రకాలుగా సాయం చేస్తామని తెలిపింది. వారికి వైద్య సహాయం, పెయిడ్ లీవ్ అందిస్తామని కంపెనీ ప్రకటించింది.

Show comments