Site icon NTV Telugu

Gujarat: గుజరాత్‌ పౌడర్ కంపెనీలో పేలుడు.. ఇద్దరు మృతి

Blast

Blast

గుజరాత్‌లోని పౌడర్ కోటింగ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదస్థలిని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.

ఇది కూడా చదవండి: Bansuri Swaraj: తల్లి బాటలో కూతురు.. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఏం చేసిందంటే..?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పౌడర్ కోటింగ్ కంపెనీలో జరిగిన పేలుడు కారణంగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారని పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు గాయపడినట్లు వెల్లడించారు. ఓవెన్‌లో ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించినట్లు నికోల్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఎస్ఎస్ గాధవి తెలిపారు. ఫ్యాక్టరీ భవనంలో పగుళ్లు ఏర్పడ్డాయి. పేలుడు జరగగానే సమీప ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఇది కూడా చదవండి: Viral Video: ఇలా తయారయ్యారేంటిరా బాబు.. రీల్స్ కోసం మరీ ఇంతలా అవసరమా..

Exit mobile version