Site icon NTV Telugu

David Warner : రైడ్ హ్యాండ్ బ్యాటర్ గా మారిన డేవిడ్ వార్నర్

David Warner

David Warner

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ స్టైల్ ఏంటని అడగ్గానే అందరు టక్కున చెప్పే సమాధానం లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అని.. మరి అలాంటి వార్నర్ తొలిసారి తన బ్యాటింగ్ శైలిని మార్చి చరిత్రకెక్కాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో భాగంగా ఇన్సింగ్స్ 8వ ఓవర్ మూడోబంతిని ఎదుర్కొనే క్రమంలో వార్నర్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైడ్ హ్యాండ్ కు స్విచ్ అయి బ్యాటింగ్ చేశాడు.

Read Also : Bombay High Court: “వైవాహిక వివాదాలు” మనదేశంలో తీవ్రమైన కేసులు..


క్రికెట్ రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు తన బ్యాటింగ్ శైలిని మార్చడం వీలుకాదు.. ఒక మ్యాచ్ లో బంతి డ్డాకా బ్యాటింగ్ ను స్విచ్ చేయడం చూస్తుంటాం.. కానీ వార్నర్ అలా కూడా చేయలేదు.. మరి వార్నర్ రూల్ ను బ్రేక్ చేసి ఎలా ఆడాడనేగా అందరి డౌట్.. అసలు ఏం జరిగిందంటే.. ఇన్సింగ్స్ 8వ ఓవర్ లో రెండో బంతిని హృతిక్ షోకీన్ నోబాల్ వేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఫ్రీహిట్ వచ్చింది. అయితే ఫ్రీహిత్ ఎలా ఆడినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఇక్కడే వార్నర్ ఎవరికీ రాని ఆలోచనతో లెఫ్ట్ హ్యాండర్ కాస్త రైట్ హ్యాండర్ గా మారి భారీ షాట్ ఆడాడు. అయితే బంతి పెద్దగా దూరం పోలేదు. కేవలం ఒక పరుగు మాత్రమే వచ్చింది. ఏదైతేనేం వార్నర్ ఎవరికి రాని ఆలోచనతో చరిత్రకెక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also : Ram Charan: చరణ్ ఇంట్లో కుక్కలా పుట్టినా బావుండేది.. రైమ్ లక్కీ బేబీ

Exit mobile version