NTV Telugu Site icon

Manasa Makeover: వన్‌ స్టాప్‌ డెస్టినేషన్‌ ఫర్‌ వెడ్డింగ్‌..

Manasa Makeover

Manasa Makeover

Manasa Makeover: పెళ్లి చేయాలనుకుంటున్నారా..? మేకప్‌ కోసం ఎక్కడికి వెళ్లాలి.. మేకోవర్‌ మార్చుకోవడానికి ఎక్కడ వెతుక్కోవాలి.. ఫొటోగ్రఫీ ఎక్కడ చూసుకోవాలి.. ఆ తర్వాత హనీమూన్‌ ఎక్కడికి వెళ్లాలి.. ఇలాంటి టెన్షన్‌ ఏమీ లేదు.. అన్నీ ఒకే దగ్గర.. మీ కోసం.. ‘మానస’ వన్‌ స్టాప్‌ డెస్టినేషన్‌ ఫర్‌ వెడ్డింగ్‌.. ఉండగా ఎందుకు చింత.. బ్యూటీ ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉన్న ధనలక్ష్మి మానస.. బాలీవుడ్‌ బ్యూటీస్‌ నుంచి టాలీవుడ్‌ హీరోయిన్ల వరకు ఎంతో మందికి పర్సనల్‌ మేకప్‌ఉమెన్‌గా పనిచేశారు.. ఆమె.. అచివ్‌ ఆఫ్‌ ఇయర్‌ 2020-21 అవార్డు, మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ క్వీన్ 2022 సెకండ్‌ రన్నర్‌గా నిలవడమే కాకుండా పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.. మరోవైపు.. తనకు తోచిన సాయాన్ని కూడా చేస్తూ వస్తున్నారు.. గత మూడేళ్లుగా తన సేవలను మరింత విస్తృతం చేశారు.. ఇక, మేకోవర్స్‌, ఫొటోగ్రఫీ, Decore (అలంకరణ), Couture ఇలా పలు రకాల సేవలను తన కస్టమర్లను అందుబాటులోకి తెచ్చారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్మోటిక్‌ అంతా కెమికల్స్‌ మయం కాగా.. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో.. ఆర్గానిక్స్‌.. బ్యూటీషన్‌కు అవసరమైన అన్ని తయారు చేస్తున్నారు..

పెళ్లి నుంచి ఈ ఇతర శుభకార్యాలు ఏవైనా సరే.. వారికి కావాల్సిన మేకప్‌ నుంచి ఫొటోగ్రఫీ వరకు అన్నీ తమే అందిస్తామంటున్నారు ధనలక్ష్మి మానస.. బ్యూటీ, స్కిన్‌, హెయిర్‌, నేల్స్, మేకోవర్స్‌, ఫొటోగ్రఫీ, డెకోర్‌, Couture ఇలా అన్నీ ఒకే దగ్గర అందుబాటులో ఉంటాయి.. అన్ని రకాల ఫొటో షూట్స్‌కు ప్రత్యేక టీమ్‌లు ఉంటాయి.. ఇక, సంవత్సరం క్రితం.. మానస వన్‌ స్టాప్‌ డెస్టినేషన్‌ ఫర్‌ వెడ్డింగ్‌ పేరుతో హైదరాబాద్‌లో ప్రత్యేక స్టూడియోను ఏర్పాటు చేశారు.. బ్రాండింగ్‌ ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ట్రాన్స్‌జెండర్‌ హక్కుల కోసం పోరాడుతోన్న ట్రాన్స్‌జెండర్‌ చంద్రముఖితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చంద్రముఖితో పాటు ఇతర కొంతమంది ట్రాన్స్‌జెండర్‌లను అందంగా తీర్చిదిద్దారు.. తనతో జర్నీ చేస్తున్న ఉద్యోగులకు ట్రాన్స్‌జెండర్స్‌ మీదుగా సత్కారం చేయించారు.

ధనలక్ష్మి మానస బ్యూటీషన్‌ నుంచి తన కెరీర్‌ను ప్రారంభించి.. నేల్స్‌ టెక్నీషన్‌, మేకప్ ఆర్టిస్ట్‌, హెయిర్‌ డ్రెసింగ్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌, హెయిర్ ఆక్సిస్సోరీస్, హెయిర్ ఎక్స్టెన్షన్.. ఇలా.. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు.. ఇక, బ్యూటీషన్‌, మేకప్‌లో ట్రైనింగ్‌ కూడా ఇస్తున్నారు.. ప్రతీ ఏడాది వీటి కోసం ఆడిషన్స్‌ నిర్వహిస్తారు.. అంతేకాదు.. ఆర్థికంగా వెనుకబడినవారిలో కొందరికి ఫ్రీగా ట్రైనింగ్‌ ఇస్తున్నారు.. కొంతమందికి డిస్కౌంట్‌పై ఈ కోర్సులు ఆఫర్‌ చేస్తున్నారు. ఇన్‌టెన్‌షిప్‌ ప్రొవైడ్‌ చేస్తున్నారు. ధనలక్ష్మి మానస.. బాలీవుడ్‌, టాలీవుడ్‌లో పలువురు హీరోయిన్లకు పర్సనల్‌ బ్యూటీషిన్‌, డిజైనర్‌గా ఉన్నారు.. బాలీవుడ్‌లో శ్రీదేవి, సుస్మితాసేన్‌ వంటి తారలకు పనిచేసిన ఆమె.. టాలీవుడ్‌లో లక్ష్మీ మంచు, తాప్సీ, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కలర్స్‌ స్వాతి, ప్రగ్యా జైస్వాల్‌, ప్రణీత, కీర్తి సురేస్‌ లాంటి స్టార్లతో పాటు ప్రముఖులకు పర్సనల్‌ మేకప్‌ఉమన్‌గా ఉన్నారు.. ఇక, ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మరో కొత్త ప్యాకేజీ తీసుకొస్తున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు హనీమూన్ ప్యాకేజీ ప్రారంభించబోతున్నారు.