NTV Telugu Site icon

Akhil : అఖిల్ సినిమాలో ‘1992 స్కామ్’ విలన్

Akhil

Akhil

Akhil : చాలా గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ తన తదుపరి సినిమాకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్న అఖిల్ తన కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవలే, ఈ సినిమాలో అఖిల్ కి విలన్ గా ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ కనిపించబోతున్నట్లు సమాచారం. ‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత, అక్కినేని అక్కినేని ఏడాదిన్నర పాటు గ్యాప్ తీసుకున్నారు. దీని కారణంగా అక్కినేని అభిమానులు ఆయనను తెరపై చాలా మిస్ అయ్యారు. చివరకు, ఆయన తన తదుపరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త అఖిల్ అభిమానులను సంతోషానికి గురి చేసింది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. గతంలో కిరణ్ అబ్బవరం దర్శకత్వంలో వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు మురళీకృష్ణ అబ్బూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘లెనిన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా భావోద్వేగ ప్రేమకథతో కూడిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని కూడా చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మెయిన్ విలన్ కోసం ప్రస్తుతం వేట కొనసాగుతోంది.

Read Also: Flights Delayed: ఉత్తర భారతదేశాన్ని కప్పేసిన మంచు.. ఆలస్యంగా నడుస్తున్న 200 విమానాలు

ప్రస్తుతం, తెలుగు సినిమాల్లో బాలీవుడ్ నటులు విలన్‌లుగా నటించే ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఇప్పుడు, అఖిల్ అక్కినేని కొత్త సినిమా ‘లెనిన్’ కోసం కూడా మేకర్స్ అదే ట్రెండ్‌ను అనుసరించబోతున్నారు. ‘లెనిన్’లో ప్రధాన విలన్ పాత్ర కోసం ‘1992 స్కామ్’ ఫేమ్ ప్రతీక్ గాంధీని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు, ‘లెనిన్’ నిర్మాతలు ప్రతీక్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే, ప్రతీక్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అతను డేట్స్ ఇచ్చినా, ‘లెనిన్’ షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే, ప్రతీక్‌ను పక్కనపెట్టి తమిళ నటుడు విక్రాంత్‌ను విలన్‌గా చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ‘లెనిన్’ నిర్మాతలు ఈ విషయంపై అతి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

Read Also:Off The Record: పిలుపే ఇస్తారా..? వైసీపీ నిరసన కార్యక్రమంలో జగన్ పాల్గొంటారా..?

Show comments