Site icon NTV Telugu

Thailand: 19 ఏళ్ల అబ్బాయికి 56 ఏళ్ల బామ్మతో నిశ్చితార్థం.. రెండేళ్లుగా సహజీవనం

Thailand Boy

Thailand Boy

Thailand: ప్రేమ గుడ్డిదని అంటారు. దానికి వయసు, దూరం, పరిధి వంటి వాటితో సంబంధం ఉండదని చాలా మంది డైలాగులు కొడుతుంటారు. ఇది చూస్తే అది అక్షరాల నిజమే అనిపిస్తుంది. ఇద్దరి మధ్య దాదాపు 37 ఏళ్ల వయస్సు తేడా ఉంది. అతనికి 19 ఏళ్లు కాగా.. ఆమెకు 56 ఏళ్లు.. అయినా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రేమకు హద్దులు లేవు, కారణం లేదు.. వయస్సుతో అసలు సంబంధమే లేదు అనే మాటలకు ఉదాహరణగా నిలిచింది ఈ జంట. ప్రస్తుతం ఈ జంట ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచం మొత్తం ఈ జంటను ఆశ్చర్యంగా చూస్తోంది. ఇప్పటికే ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకుంది. త్వరలో పెళ్లిపీటలు కూడా ఎక్కనున్నారట.

ఉత్తర థాయ్‌లాండ్‌లోని సఖోన్‌ నఖోన్‌ రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల వుతిచాయ్‌ చంత్రాజ్‌ అనే యువకుడు, 56 ఏళ్ల వయసు ఉన్న జన్లా నాముంగ్రాక్ అనే‌ మహిళను పెళ్లి చేసుకోబోతున్నాడు. అతని 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెను కలిశాడు. అప్పట్లో వీరిద్దరూ ఇరుగుపొరుగు ఇళ్లలోనే నివసించేవారు. ఇంటి పనుల్లో, ఇంటిని శుభ్రం చేయడంలో ఆమెకు సహాయం చేయడంతో పరస్పర స్నేహం ఏర్పడింది. తర్వాత అది రిలేషన్‌షిప్‌గా మారింది. ఇప్పుడు గత రెండేళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. దీని గురించి అతడిని ప్రశ్నిస్తే చాలా హాయిగా ఉన్నానని సమాధానం ఇస్తున్నాడు. నా జీవితంలో మొదటిసారి హాయిగా జీవిస్తున్నానని అతను సమాధానం చెబుతున్నాడు. తాను ఆమెను తుంగ్‌ అని పిలుస్తానని అతడు చెప్పాడు.

For calling a girl ‘item’: అమ్మాయిని ‘ఐటమ్‌’ అని పిలిచాడు.. తిక్కకుదిరింది..

మరోవైపు వారిద్దరి మధ్య ఉన్న వయస్సు తేడా గురించి వారు ఎలాంటి ఆందోళన చెందడం లేదు. ఇంటర్వ్యూలు, బహిరంగంగా తమ బంధాన్ని వెల్లడించటంలో ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు. నగరంలో బయటకి వెళ్లినప్పుడు చేతులు పట్టుకుని, ముద్దులు పెట్టుకుంటూ సరదాగా కనిపిస్తున్నారు. ఆమెకు 30 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. కానీ వుతిచాయ్‌ తనను ఇంకా యువతిననే భావన కలిగిస్తున్నాడని నముంగ్రాక్‌ తెలిపింది. త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ఆమె తెలిపింది.

Exit mobile version