NTV Telugu Site icon

Student Delivery: హాస్టల్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని

Student Delivery

Student Delivery

Student Delivery: గుంటూరు సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాకు దర్శికి చెందిన విద్యార్థిని గుంటూరు సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్‌లోనే ప్రసవించడంతో ఉన్నతాధికారులు అలెర్ట్ అయ్యారు. తన తోటి ఫార్మసీ విద్యార్థిని సహకారంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ విద్యార్థిని.

Read Also: Pushpa 2: పుష్ప సినిమా చూస్తున్న సమయంలో గ్యాంగ్‌స్టర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు..

ఈ నేపథ్యంలో అధిక రక్తస్రావం అవుతుండటంతో విద్యార్థినిని అధికారులు జీజీహెచ్‌కు తరలించారు. జరిగిన ఘటనపై కలెక్టర్ నాగలక్ష్మీ సీరియస్ అయ్యారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారిని జయప్రదను జిల్లా కలెక్టర్ సస్పెండ్‌ చేశారు. ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. విద్యార్థిని గర్భానికి సమీప బంధువు కారణమని సమాచారం. విద్యార్థిని గర్బానికి సమీప బంధువు కారణమని సమాచారం. అయితే బంధువుల సమక్షంలో వీరికి త్వరలోనే వివాహం జరగనుందని సమాచారం.