Great Love: ప్రేమకు కులం, మతం, ప్రాంతం, వయసు, ఏదీ లేదు. ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ ప్రేమ ఎలా కలుగుతుందో చెప్పలేం. ప్రేమిస్తే వారు వలచిన వారే ప్రపంచం. అందుకు ఎంత సాహసానికైనా తెగిస్తారు. ఇంట్లో వారినైనా, సమాజాన్నైనా ఎదురిస్తారు. ఎన్ని హద్దులున్నా దాటుకుని వచ్చి.. ఒక్కటవుతారు. ఇలాంటి ఘటన తాజాగా ఒక జంట వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లో 19 ఏళ్ల అమ్మాయి.. 70 ఏళ్ల వ్యక్తిని ప్రేమించింది. వయస్సులో ఇంత తేడా ఉన్నా.. ఆయనతో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుని… ఆయనతోనే జీవిస్తుంది.
Read Also : Rotomac Pen : ‘పెన్ను’ పై కేసు పెట్టిన సీబీఐ.. బ్యాంకులో రూ.750కోట్లకు టోకరా
లియాఖత్ అలీ (70) లాహోర్‌లోని ఓ పార్కుకు ప్రతీరోజు మార్నింగ్ వాక్‌కు వెళ్తుండేవాడు. అక్కడకు షుమైలా (19) కూడా వస్తుండేది. అనుకోకుండా లిఖత్ అలీ ఓ పాటను హమ్ చేస్తుండగా షుమైలా విన్నది.. అతడు పాడిన పాటకు ఫిదా అయింది. వయసులో చాలా తేడా ఉన్నా అనతి కాలంలో వారి పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరి పెళ్లికి షుమైలా తల్లిదండ్రులు అంగీకరించ లేదంట. చెడు తిరుగుళ్లు తిరిగే వారితో కంటే నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటే మంచిదని షుమైలా సూచించింది. తర్వాత వారిని ఒప్పించానని తెలిపింది. షుమైలా రాకతో తనకు కొత్త లోకం పరిచయమైందంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు వయసు శరీరానికే కానీ మనసుకు కాదని లిఖత్ చెప్పుకురావడం గమనార్హం.