Site icon NTV Telugu

Karimnagar: పొలంపనుల్లో తల్లి.. ఆడుకుంటూ వెళ్లి బావిలో పడిన 18 నెలల బాలుడు..

Boy

Boy

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తల్లి పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఆడుకుంటూ వెళ్లి వ్యవసాయబావిలో పడిపోయాడు 18 నెలల బాలుడు. కౌశిక్ నందు అనే బాలుడు బావిలో పడి మృతిచెందాడు. బాలుడిని వ్యవసాయ బావి వద్ద కూర్చోబెట్టి తల్లి పొలానికి నీళ్లు పెడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి కళ్ళముందే బాలుడు మృతి చెందడంతో గుండెలవిసేలా రోదించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో బాలుడిని బావిలోంచి బయటకు తీశారు. తమ కళ్ల ముందే ఆడుకుంటున్న బాలుడు బావిలో పడి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న పిల్లల తల్లిదండ్రులు ఏమాత్రం ఏమరపాటుగా ఉండకూడదని ఎంత బిజీగా ఉన్నా పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలని పోలీసులు సూచించారు.

Exit mobile version