NTV Telugu Site icon

America : టోర్నడోలో విధ్వంసం.. 18 మంది మృతి..

Thufan America

Thufan America

మరోసారి విధ్వంసకర తుఫానులు, అమెరికాలో విధ్వంసం సృష్టించాయి. శుక్ర, శనివారాల్లో తెల్లవారుజామున వచ్చిన భీకర టోర్నడో కారణంగా 18 మంది మరణించారు. అంతే కాదు పలువురు గాయపడ్డారు. అమెరికాలోని ఇల్లినాయిస్ లోని అర్కాన్సాస్ లో టోర్నడో బీభత్సం సృష్టించింది. దక్షిణ యూఎస్ రాష్ట్రంలో అర్కాన్సాస్ లోని అనేక ప్రాంతాల్లో ఈ సుడిగాలిలో గాలి వేగం చాలా ఎక్కువగా ఉంది.

Also Read : Bhakthi TV Live: కర్మ దోషాలు తొలగి సుఖశాంతులు చేకూరాలంటే ఈసోత్రం వినండి

విధ్వంసకర తుఫానులు, టోర్నడోలు.. వ్యాపారులు క్లిష్టమైన మౌలిక సదుపాయాలకు విపరీతమైన నష్టాన్ని కలిగించింది. ప్రతికూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని అర్కాన్సాస్ గవర్నర్ శుక్రవారం మధ్యాహ్నం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అలాగే మిస్సోరిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
నార్త్ లిటిల్ రాక్ లో టోర్నడోలో తుఫాన్ కారణంగా ఒక వ్యక్తి, వ్యాన్ లో ఉన్న ఇద్దరు మృతి చెందారు. అక్కడ కనీసం 30 వరకు ఆస్పత్రి పాలయ్యారని లిటిల్ రాక్ మేయర్ ఫ్రాంక్ స్కాట్ జూనియర్ తెలిపారు. ఇదొక్కటే కాదు.. 2 వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల గోడలు, పైకప్పులు కూలిపోయాయి. దీనికి తోడు గాలివాన ధాటికి ఆగి ఉన్న వాహనాలు బోల్తా పడి చెట్లు, విద్యుత్ తీగలు నేలకూలాయి.

Also Read : Sunday Stotram: అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ సోత్రపారాయణం చేయండి

అదే సమయంలో.. ఉత్తర ఇల్లినాయిస్ లో శుక్రవారం రాత్రి దీని కారణంగా ఒకరు మరణించారు. వీరితో పాటు మరో 28 మంది ఆస్పత్రిలో చేరారు. బెల్విడెరేలోని ఓ థియేటర్ లో పైకప్పు కూలిపోయి అందులో 260 మంది ఉన్నారని ఫైర్ చీఫ్ సీన్ షాడ్లీ తెలిపారు. అర్కాన్సాస్, ఇల్లినాయిస్, ఇండియానా మరియు టేనస్సీలతో పాటు నేషనల్ వెదర్ సర్వీస్ విస్కాన్సిస్, ఐయోవా మిస్సిస్సిప్పిలలో సుడిగాలులు వచ్చాయి.

Also Read : IPL 2023 : మూడేండ్ల తరువాత ఉప్పల్ లో ఐపీఎల్ సంబురం

ఆగ్నేయా యూఎస్ రాష్ట్రమైన మిస్సిస్సిప్పీలో విధ్వంసకర తుఫాన్ తో తీవ్రమైన ఉరుములతో కూడిన సుడిగాలి వచ్చింది. మిస్సిస్సిప్పిలో టోర్నోడో కారణంగా 26 మంది చనిపోయారు. వంద మైళ్ల కంటే ఎక్కువ ప్రాంతం దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. మిస్సిస్సిప్పిలో తుఫాన్ వల్ల ఏర్పడిన పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Show comments