NTV Telugu Site icon

Boy Suicide: పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయంతో 17 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

Crime News

Crime News

Boy Suicide: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 17 ఏళ్ల బాలుడు తనను అరెస్టు చేస్తానని పోలీసు అధికారి బెదిరించడంతో భయందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు, మాజీ సైనికుడి కుమారుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ధూమంగంజ్‌లోని సాకేత్ నగర్‌లో బాలుడు తన కారును తన పొరుగువారి గేట్‌ను ఢీకొట్టడంతో ఇంటికి నష్టం జరిగింది. ఢీకొన్న తర్వాత, ఇరుగుపొరుగు వారు అతనిపై దాడి చేసి, పోలీసులకు ఫోన్ చేయగా.. అతడిని అరెస్టు చేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని, అతని తల్లిని జైలులో పెడతామని బెదిరించారు.

Read Also: Summer heat: రికార్డు స్థాయిలో ఎండలు.. హుజూర్‌నగర్‌ లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత

పోలీసులు తల్లిని, పెద్ద కొడుకును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో పోలీసుల బెదిరింపులకు భయపడిన బాలుడు తన గదిలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. ధూమన్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి రాజేష్ మౌర్య ప్రకారం.. బాలుడు ఉరి వేసుకున్నాడు, అయితే వారిపై చేసిన ఆరోపణల గురించి అతనికి తెలియవని పోలీసు అధికారి చెప్పారు. ఆ బాలుడి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.