NTV Telugu Site icon

China Taiwan: తైవాన్ సరిహద్దులోకి ప్రవేశించిన 153 చైనా మిలిటరీ విమానాలు

China Taiwan

China Taiwan

China Taiwan: చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తత నిరంతరం పెరుగుతోంది. మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. అయితే తైవాన్ సైన్యం కూడా స్పందించింది. తైవాన్ సరిహద్దుకు సమీపంలో చైనా విమానాలు, నౌకాదళ నౌకలు కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 6 గంటలకు తైవాన్ చుట్టూ 14 చైనా నౌకాదళ నౌకలు, 12 అధికారిక నౌకలు కనిపించాయని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ (MND) తెలిపింది. 153 సైనిక విమానాలు ఎగురుతూ కనిపించాయని, 153 విమానాలలో 111 విమానాలు తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటి తైవాన్ తూర్పు వైమానిక రక్షణ గుర్తింపు జోన్ (ADIZ)లోకి ప్రవేశించాయని మిలిటరీ నివేదించింది. చైనా, తైవాన్ మధ్య ఈ నీటి ఒప్పందం అనధికారిక సరిహద్దు మాత్రమే.

Elephants: పుంగనూరులో ఏనుగుల గుంపు.. రైతును తొక్కి చంపేశాయి..

ఈ సందరబంగా తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లో.. ‘ఈ ఉదయం, తైవాన్ చుట్టూ 153 విమానాలు, 14 నౌకలు, 12 అధికారిక నౌకలు కనిపించాయి. 111 విమానాలు తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటి తైవాన్ ఉత్తర, మధ్య, నైరుతి, ఆగ్నేయ ADIZలలోకి ప్రవేశించాయి. పరిస్థితిని గమనిస్తూనే ఉన్నామని తెలిపింది.

World Students Day 2024: నేడు ప్రపంచ విద్యార్థి దినోత్సవం.. అబ్దుల్ కలాం జయంతి రోజునే ఎందుకు..?

Show comments