ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు ఆడపిల్లకు జన్మనిచ్చింది. స్థానిక పోలీసులు బుధవారం ఒక ప్రకటనలో బాలిక తండ్రిని కనుగొనడానికి DNA పరీక్ష ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. అదే సమయంలో, అత్యాచార నిందితుడు శశికాంత్ కుమార్ గౌర్‌ను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు. ఏడాది క్రితం బాధితురాలు అత్యాచారానికి గురైంది. నిందితుడు శశికాంత్ సురౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
Also Read:RBI Governor: ట్రంప్ సుంకాల పెంపు ప్రకటనపై స్పందించిన ఆర్బీఐ గవర్నర్..
కొన్ని రోజుల తర్వాత బాధిత బాలిక కుటుంబానికి ఆమె గర్భం దాల్చిన విషయం తెలిసింది. దీంతో వారు వెంటనే పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 64 (అత్యాచారం), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని కఠినమైన నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డియోరియా పోలీసు సీనియర్ అధికారి ఒకరు వార్తా సంస్థకు తెలిపారు. దీని తరువాత స్థానిక నివాసి శశికాంత్ కుమార్ గౌర్‌ను అరెస్టు చేశారు.
Also Read:CM Revanth Reddy : రిజర్వేషన్లు ఇవ్వకపోతే మోడీని గద్దె దించుతాం
ఎస్పీ విక్రాంత్ వీర్ మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం మైనర్ పరిస్థితి విషమంగా ఉందని, దీని కారణంగా ఆమెను మహర్షి దేవ్రహా బాబా మెడికల్ కాలేజీలో చేర్పించారని, అక్కడ ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చిందని తెలిపారు. ప్రస్తుతం, నిందితుడు జైలులో ఉండగా, బాలిక తండ్రి గుర్తింపును చట్టబద్ధంగా నిర్ధారించడానికి DNA పరీక్ష ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. కోర్టు విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లి, నవజాత శిశువు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
