Site icon NTV Telugu

Floating bridge: ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగి 15 మందికి గాయాలు

Kerla

Kerla

కేరళలోని (Kerala) తిరువనంతపురం సముద్ర తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి (Floating bridge) తెగిపోవడంతో 15 మంది గాయపడ్డారు. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. తిరువనంతపురం తీరంలో జరిగిన ఈ భయానక సంఘటనతో మహిళలు, చిన్న పిల్లలు హడలెత్తిపోయారు.

ప్రమాదం తర్వాత సమాచారం అందుకున్న పోలీసు అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మహిళలు, పిల్లలను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బలమైన అలల కారణంగానే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయిందన్నారు. అనంతరం మహిళలు, పిల్లలు సముద్రంలో పడిపోయారని చెప్పుకొచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version