Site icon NTV Telugu

Mizoram : మిజోరాంలో కూలిన‌ క్వారీ.. శిథిలాల్లో చిక్కుకున్న15మంది కార్మికులు

Quary

Quary

Mizoram : మిజోరాంలో విషాదం నెలకొంది. సోమవారం సాయంత్రం స్టోన్ క్వారీ కుప్పకూలింది. కార్మికులు మధ్యాహ్నం అన్నం తిని వచ్చిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 12 మంది కూలీల‌తో పాటు హిటాచి డ్రైవ‌ర్లు క్వారీ లోప‌ల చిక్కుకుపోయారు. వాళ్లను కాపాడేందుకు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. న‌య్‌థియాల్ జిల్లాలోని మౌద‌ర్హ్ అనే గ్రామంలో ఉన్న ఏబీసీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన క్వారీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రాష్ట్ర విప‌త్తు నివార‌ణ బృందాలతో పాటు స‌రిహ‌ద్దు భ‌ద్రతా ద‌ళాలు, అస్సాం రైఫిల్స్ రెస్య్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ప్రమాదం విష‌యం తెలిసిన వెంట‌నే స‌హాయ‌ం చేసేందుకు చుట్టుప‌క్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున స్థానికులు త‌ర‌లివ‌చ్చారు. స్టోన్ క్వారీ శిథిలాల్లో చిక్కుకున్న 12 మంది కూలీలు బీహార్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. ఈ క్వారీలో రెండున్నర ఏళ్లుగా పనులు కొనసాగుతున్నాయి.

Read Also: Railway Zone: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్.. నిధులు విడుదల చేసిన కేంద్రం

Read Also:Arvind Kejriwal: మీ ఓటు ఆ పార్టీకి వేసి వేస్ట్ చేయవద్దు.. పోరులో ఉండేవి రెండే

Exit mobile version