NTV Telugu Site icon

Bible: రూ.57 కోట్లకు అమ్ముడుబోయిన 14వ శతాబ్దం అరుదైన బైబిల్..

Bible Action

Bible Action

Bible Action: 14వ శతాబ్దంలో స్పెయిన్‌కు చెందిన ప్రముఖ వ్యక్తి రబ్బీ రాసిన అరుదైన బైబిల్ ఇటీవల వేలంలో 69 లక్షల డాలర్లకు (రూ. 57 కోట్లకు పైగా) అమ్ముడుపోయింది. ఈ బైబిల్ బంగారు వర్ణంలో రంగుల పేజీలు, యూదు, క్రైస్తవ కళాత్మక సంప్రదాయాలను మిళితం చేస్తాయి. ఈ షెమ్ తోవ్ బైబిల్ ఉత్తర స్పానిష్ నగరం సోరియాలో 1312 సంవత్సరంలో రబ్బీ షెమ్ తోవ్ ఇబ్న్ గావ్ చేత పూర్తి చేయబడింది. ఇక ఈ వేలం గురించి పూర్తి వివరాలు చూస్తే..

Sanjauli mosque row: సంజౌలి మసీదు వివాదం.. నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు

ఈ బైబిల్ వేలం న్యూయార్క్‌లో ఉన్న సోథెబైస్ వేలం హౌస్ ద్వారా నిర్వహించబడింది. దీని అమ్మకం అంచనా 50 లక్షల డాలర్ల నుండి 70 లక్షల డాలర్లు (సుమారు రూ. 41 కోట్ల – 58 కోట్లు) వేశారు. 800 పేజీల బైబిల్ లో లోతైన పాండిత్యం, నిగూఢమైన పదాల ఉపయోగం, సాంస్కృతిక కళాత్మక ప్రభావాల కలయిక దీనిని అరుదుగా చేస్తుంది అని సోథెబీ అంతర్జాతీయ సీనియర్ జ్యూయిష్ స్పెషలిస్ట్ షెరీన్ లైబెర్మాన్ మింట్జ్ అన్నారు. ఈ బైబిల్ హీబ్రూ మాన్యుస్క్రిప్ట్స్ ప్రపంచ ప్రఖ్యాత కలెక్టర్ డేవిడ్ సోలమన్ సేకరణ నుండి వచ్చింది.

Himachal Pradesh : సంజౌలి గొడవ సద్గుమణగక ముందే మండితో హిందువుల నిరసన

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో, ప్రపంచంలోని పురాతన పుస్తకాలలో ఒకటైన క్రాస్బీ స్కోయెన్ కోడెక్స్, లండన్‌ లోని క్రిస్టీ వేలం హౌస్ ద్వారా విక్రయించబడింది. ఈ పుస్తకాన్ని క్రీస్తు శకం 250 నుండి 350 వరకు క్రైస్తవ మఠంలో కూర్చొని రాశారని నమ్ముతారు.

Show comments