Honor 200 Pro Offers in Amazon: పండగ సీజన్ సందర్భంగా ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ 2024ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న సేల్ ఆరంభమైంది. సేల్‌లో భాగంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఉంది. ముఖ్యంగా మొబైల్స్‌పై 40 శాతం అమెజాన్ ప్రకటించింది. ఈ క్రమంలో ‘హానర్ 200 ప్రో’పై 13 వేల తగ్గింపు లభిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
హానర్ భారత్‌లో ఇటీవల రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. హానర్ 200 5జీ, హానర్ 200 ప్రో 5జీ పేరిట వీటిని తీసుకొచ్చింది. ప్రో వేరియంట్ టాప్ మోడల్‌ను రూ.57,999 ధరకు కంపెనీ విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.13 వేల తగ్గింపును ప్రకటించింది. దాంతో రూ.44,99కి మీకు లభిస్తుంది. ఎస్‌బీఐ కార్డుపై 1000 రూపాయల తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ తగ్గింపు తర్వాత హానర్ 200 ప్రో 5జీ (12+ 512జీబీ) వేరియంట్ రూ.43,999కు అందుబాటులో ఉంటుంది.
Also Read: Joe Root: ఇంకెంతకాలం ఆడతావని ప్రశ్నించారు.. జో రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
హానర్ 200 ప్రో 5జీ ఫీచర్స్:
# 6.78 అంగుళాల అమోలెడ్ క్వాడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే
# 120Hz రీఫ్రెష్ రేటు, 4,000 నిట్స్ బ్రైట్‌నెస్
# స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3, ఆర్‌ఎఫ్ ఎన్‌హ్యాన్స్‌డ్ చిప్ హానర్ సీ1+ ప్రాసెసర్
# ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 8.0
# 50 ఎంపీ సూపర్ డైనమిక్ హెచ్9000 సెన్సర్ పోట్రెయిట్ + 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్856 టెలీఫొటో + 12 ఎంపీ అల్ట్రావైడ్ అండ్ మ్యాక్రో
# 50ఎంపీ సెల్ఫీ కెమెరా
# 5,200 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ (100W సూపర్‌ఛార్జ్/ 66W వైర్‌లెస్ సూపర్‌ఛార్జ్ ప్రో)