Site icon NTV Telugu

Cannabis: బస్సులో గుట్టుగా భారీగా గంజాయి రవాణా.. ఇలా చిక్కారు..

Cannabis

Cannabis

Cannabis: ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. గుట్టుగా గంజాయి రవాణా అవుతూనే ఉంది.. కొన్ని సార్లు లోడ్‌ల కొద్ది గంజాయి దొరకడంతో.. అధికారులు, పోలీసులు నోరువెల్లబెట్టిన సందర్భాలు లేకపోలేదు.. అయితే, తాజాగా గుట్టుగా ఆర్టీసీ బస్సులో గంజాయి సరఫరా చేస్తుందడగా పట్టుకున్నారు.. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమానాపురం లో జాతీయ రహదారిపై బస్సులో ప్రయాణికుడు ముసుగులో రెండు బ్యాగుల్లో 14 కిలోలు బరువు గల 8 ప్యాకెట్లు గంజాయిని స్వాదీన చేసుకున్నారు పోలీసులు.

Read Also: France: పార్లమెంట్‌ను రద్దు చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు.. ఎన్నికలకు పిలుపు

విశాఖ డిపోకు చెందిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది.. సాలూరు నుండి విశాఖ వెల్లే ఆల్ట్రా డీలక్స్ బస్సులో తరలిస్తున్న గంజాయిని కండాక్టర్ చాకచక్యంగా వ్యవహారించడంతో పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు తప్పించుకొని పారిపోయారు.. బస్సు ఒన్ మేన్ సర్వీస్ కావడం.. పాసింజర్లను లెక్కించే క్రమంలో గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అనుమానించిన డ్రైవర్‌.. పోలీస్‌ స్టేషన్‌కు తరించే ప్రయత్నం చేశాడు.. అయితే, ఈ క్రమంలో బస్సులో నుండి పరారయ్యారు గంజాయి స్మగ్లర్లు.. రెండు బ్యాగుల్లో ఉన్నా 14 కిలోల బరువు గల 8 గంజాయి ప్యాకట్ల గుర్తించిన పెదమానాపురం పోలీసులు.. కేసు నమోదు చేశారు.. ఇక, ఆ 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version