Site icon NTV Telugu

YS Bhaskar Reddy: వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్

Ys Bhaskar Reddy

Ys Bhaskar Reddy

YS Bhaskar Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి సీబీఐ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ను విధించారు. దీంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. వివేకా కేసులో ఉదయం పులివెందులలో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం ఆయనను సీబీఐ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరచగా.. భాస్కర్ రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

Read Also: Avinash Reddy: వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు చేస్తోంది..

ఇవాళ ఉదయం అరెస్ట్‌ చేసిన సీబీఐ అధికారులు హైదరాబాద్‌ తరలించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించారు.

Exit mobile version