NTV Telugu Site icon

Cancer Cases: భారత్ లో 14 లక్షల మందికి క్యాన్సర్.. WHO హెచ్చరిక..

Who

Who

ఇండియాలో 2022లో కొత్తగా 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆ ఏడాది సుమారు 9.1 లక్షల మంది క్యాన్సర్ వ్యాధి వల్ల చనిపోయారు. అయితే, భారతీయుల్లో ఎక్కువ శాతం రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్కయ సంస్థ వెల్లడించింది. పెద‌వి, నోరు, ఊపిరితిత్తులు క్యాన్సర్ కేసులు ఎక్కువ శాతం పురుషుల్లో వస్తుంది. నోటి క్యాన‌ర్స్ 15.6 శాతం, శ్వాస‌కోస క్యాన్సర్ 8.5 శాతం కేసులు నమోదు అయ్యాయి. ఇక, మ‌హిళ‌ల్లో రొమ్ము, స‌ర్వైక‌ల్ క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి.

Read Also: CM YS Jagan: నేడు దెందులూరులో సిద్ధం సభకు సీఎం జగన్

అయితే, రొమ్ము క్యాన్సర్ 27 శాతం, 18 శాతం స‌ర్వైక‌ల్ క్యాన్సర్ కేసులు ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ డ‌బ్ల్యూహెచ్ క్యాన్సర్ ఏజెన్సీగా వర్క్ చేస్తుంది. క్యాన్సర్ ఉన్నట్లు గుర్తుంచిన ఐదేళ్ల త‌ర్వాత కూడా ఇండియాలో ప్రాణాల‌తో ఉన్న వారి సంఖ్య 32.6 శాతంగా ఉందని ఆ నివేదికలో తేల్చింది. ప్రతి ఐదుగురిలో ఒక‌రికి క్యాన్సర్ వస్తుంది.. 9 మంది పురుషుల్లో ఒక‌రు, 12 మంది మ‌హిళ‌ల్లో ఒక‌ మహిళకు క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అలాగే, 115 దేశాల‌కు చెందిన క్యాన్సర్ రిపోర్టును డ‌బ్ల్యూహెచ్‌వో రిలీజ్ చేసింది. కేవ‌లం 39 శాతం దేశాలు మాత్రమే క్యాన్సర్ చికిత్స గురించి అవ‌గాహ‌న కల్పిస్తున్నట్లు ఆ నివేదికల్లో పేర్కొన్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల మందిలో కొత్తగా క్యాన్సర్ ను గుర్తించారు. 97 లక్షల మంది ఈ క్యాన్సర్ వ్యాధి వ‌ల్ల మ‌ర‌ణించారు.