Site icon NTV Telugu

IPL 2025 Mega Auction: మెగా వేలంలో అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీపై కనక వర్షం..

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

ఐపీఎల్ మెగా వేలంలో ఎంతగానో ఎదురు చూసిన అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీ అమ్ముడుపోయాడు. 13 ఏళ్ల ఈ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్‌ అనుకున్న ధర కంటే ఎక్కువగానే కొనుగోలు చేసింది. బీహార్‌కు చెందిన వైభవ్ కోసం ఢిల్లీ, రాజస్థాన్ పోటీ పడ్డాయి. అతని బేస్ ప్రైస్ రూ. 30 లక్షలు. చివరకు ఆర్ఆర్ జట్టు ఇతన్ని రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. సంజూ శాంసన్ సారథ్యంలో ఈ యువ ఆటగాడు ఐపీఎల్ 2025 ఆడనున్నాడు. కాగా.. వైభవ్ గతంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై 82 పరుగులు చేశాడు.

Bollywood : సీక్వెల్స్ తో బండి లాగిస్తున్న ‘బాలీవుడ్’

సమస్తిపూర్‌కు చెందిన సూర్యవంశీ తన అసాధారణ విజయాలతో చరిత్ర సృష్టించాడు. 2023-24 రంజీ ట్రోఫీ సీజన్‌లో ముంబైపై కేవలం 12 సంవత్సరాల 284 రోజులలో అరంగేట్రం చేశాడు. టోర్నమెంట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. 15 ఏళ్ల 57 రోజుల్లో అరంగేట్రం చేసిన యువరాజ్ సింగ్.. 15 ఏళ్ల 230 రోజుల వయసులో సచిన్ టెండూల్కర్ వంటి క్రికెట్ దిగ్గజాల రికార్డులను సూర్యవంశీ బద్దలు కొట్టాడు.

Ramdas Athawale: ఫడ్నవిస్‌ సీఎం అయ్యే ఛాన్స్.. కేంద్రమంత్రి వ్యాఖ్య

చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్‌లో సూర్యవంశీ తనదైన ప్రదర్శనను కనబరిచాడు. అతను కేవలం 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. 13 సంవత్సరాల 188 రోజుల వయస్సులో.. 170 సంవత్సరాల క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేశాడు. దీంతో.. యువ స్థాయిలో భారతీయుడిగా వేగవంతమైన సెంచరీ రికార్డును కూడా నెలకొల్పాడు.

Exit mobile version