Site icon NTV Telugu

Tirumala Sri Vari Mettu: డబ్బులు రిటన్ ఇవ్వాల్సి వస్తుందని రాష్ డ్రైవింగ్.. 13 మంది భక్తులకు గాయాలు!

Tirumala Srivari Mettu

Tirumala Srivari Mettu

తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఆటో వాలాల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. టైం స్లాట్ టోకెన్ తీయిస్తామంటూ రైల్వే స్టేషన్ వద్ద భక్తులకు ఎక్కించుకుని వేగంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమయం ముగిస్తే భక్తుల వద్ద తీసుకున్న డబ్బులు రిటన్ ఇవ్వాల్సి వస్తుందనే అలోచనతో ఓ ఆటో డ్రైవర్ ఒవర్ టేక్ చేసే సమయంలో ముందున్న జీపును డీకోట్టాడు. దీంతో ఆటోలొ ప్రయాణిస్తున్న 13 మంది భక్తులు గాయాలు అయ్యాయి‌‌‌‌‌. బెంగుళూరు చెందిన భక్తుడి తలకు తీవ్రమైన గాయం కావడంతో స్దానిక ఆసుపత్రికి తరలించారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఆటోవాలాల దందాను ఆరికట్టాలని భక్తులు‌‌ కోరుతున్నారు. టైం స్లాట్ టోకెన్ పెంచితే.. ఈ దందాకు అడ్డుకట్ట పడుతుందంటున్నారు.

శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రైవేటు ట్యాక్సీలు, ఆటోవాలాలు భక్తుల్ని నిండా ముంచేస్తున్నారు. దర్శనం టికెట్ల పేరుతో భక్తులు‌ను నిలువు దోపిడీ చేస్తున్నారు. బస్సులు, రైళ్లలో తిరుపతికి చేరుకున్న భక్తులు.. ప్రైవేట్​ వాహనాలు, ఆటోలు, ట్యాక్సీల్లో శ్రీవారి మెట్టుకు చేరుకుంటారు. కొంతమంది ఆటో వాలాలు టైం స్లాట్​ టికెట్లు ఇస్లామని భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఒక్కో ఆటో డ్రైవర్ 5-7 మంది భక్తుల బృందం నుంచి రూ.5 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. టీటీడీ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని భక్తులు‌‌ విజ్ఞప్తి చేస్తున్నారు.

Exit mobile version