NTV Telugu Site icon

Road Accident: పెళ్లిబృందం ట్రాక్టర్‌ బోల్తా.. 13 మంది మృతి!

Road Accident

Road Accident

Road Accident in Madhya Pradesh Today: మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్‌గఢ్‌ జిల్లాలోని పిప్లోధిజాద్‌లో ఆదివారం రాత్రి పెళ్లిబృందం ట్రాక్టరు ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో 13 మందిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు.

Also Read: ladies Missing In Beach: బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు..

గాయపడిన వారిలో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. తల, ఛాతికి గాయాలై పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని భోపాల్‌కు తరలించినట్లు జిల్లా కలెక్టర్‌ హర్ష్‌ దీక్షిత్‌ ఓ జాతీయ మీడియాకు తెలిపారు. అయితే వీరికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపినట్లు కలెక్టర్‌ చెప్పారు. రాజస్థాన్‌ నుంచి ఈ పెళ్లిబృందం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై సీఎం మోహన్ యాదవ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Show comments