Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..

5555555

5555555

జూలై 2026లో భారతదేశంలో 125cc మోటార్‌సైకిల్ విభాగం మొత్తం 16.89 శాతం వార్షిక వృద్ధితో 2,82,726 యూనిట్ల విక్రయాలు సాధించింది. ఈ జాబితాలో 1,76,756 యూనిట్లు అమ్ముడుపోయి 62.52 శాతం మార్కెట్ వాటాతో హోండా షైన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 27.47 శాతం వృద్ధి. ఈ బైక్‌లో 123.94cc BS6 ఫేజ్-2 పెట్రోల్ ఇంజిన్, 10.74bhp పవర్, 11Nm టార్క్, 5-స్పీడ్ గేర్‌బాక్స్, సైలెంట్ ACG స్టార్టర్, eSP టెక్నాలజీ ఉన్నాయి. లీటర్‌కు 55-60 కి.మీ మైలేజ్ ఇచ్చే ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.80,852 – రూ.85,211 మధ్య ఉంది.

రెండో స్థానంలో 39.22 శాతం వృద్ధితో 34,125 యూనిట్లు విక్రయించిన టీవీఎస్ రైడర్ నిలిచింది. మూడో స్థానంలో 38.01 శాతం పతనంతో 25,604 యూనిట్లు అమ్ముడుపోయిన బజాజ్ పల్సర్ (125 + ఎన్‌ఎస్) నిలిచింది. నాలుగో స్థానంలో 44.13 శాతం వృద్ధితో 17,999 యూనిట్లు దక్కించుకున్న హీరో స్ప్లెండర్ 125, ఐదో స్థానంలో 21.49 శాతం వృద్ధితో 12,995 యూనిట్లు విక్రయించిన హీరో గ్లామర్ నిలిచాయి. ఆరో స్థానంలో 21.09 శాతం పతనంతో 9,696 యూనిట్లు దక్కించుకున్న హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ఉండగా, ఏడో స్థానంలో 3,859 యూనిట్లతో కొత్త ఎంట్రీ హోండా హార్నెట్ నిలిచింది. ఎనిమిదో స్థానంలో 11.37 శాతం పతనంతో 1,692 యూనిట్లు అమ్ముడుపోయిన సీఎన్జీ బైక్ బజాజ్ ఫ్రీడం నిలిచింది. తొమ్మిదో స్థానంలో కేటీఎం 125కి జూలైలో ఒక్క కొనుగోలుదారు కూడా రాలేదు.

పరిమిత కాలపు ప్రత్యేక డీల్స్ ప్రకారం.. టీవీఎస్ రైడర్ ధర రూ.82,860 – 98,550 (ఈఎంఐ రూ.1,100), హోండా షైన్ ధర రూ.80,852 – 86,211 (ఈఎంఐ రూ.1,100), బజాజ్ ఫ్రీడం ధర రూ.90,272 – 1.1 లక్షలు (ఈఎంఐ రూ.1,200), హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ధర రూ.91,500 – 1.08 లక్షలు (ఈఎంఐ రూ.1,200), ఓబెన్ రార్ ఎవో ధర రూ.99,999 (ఈఎంఐ రూ.1,400), హీరో స్ప్లెండర్ ప్లస్ ధర రూ.77,557 – 80,331 (ఈఎంఐ రూ.1,100)గా అందుబాటులో ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌కు డిమాండ్ జోరుగా కొనసాగుతోంది.