Gujarat Cable Bridge: గుజరాత్ బ్రిడ్జి ఘటన తీవ్ర విషాధం నెలకొల్పింది. మోర్బీలో బ్రిటీష్ కాలం నాటి కేబుల్ బ్రిడ్జి కూలిపోవడానికి కారణాలను అధికారులు కనుగోనే పనిలో నిమగ్నమయ్యారు. మోర్బీ వంతెన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి ముందు ఊయల మాదిరిగా ఊగుతుండగా.. కొందరు యువకులు ఇటూ అటూ దూకినట్టు దృశ్యాల్లో రికార్డైంది. అంతలోనే ఒక్కసారిగా తీగలు తెగిపోయి దానిపై ఉన్నవారు నదిలో పడిపోయారు. ఆ సమయానికి వంతెనపై 500 మంది వరకూ ఉన్నారు. ఊహించని ప్రమాదంతో హాహాకారాలు చేస్తూ నదిలో మునిగిపోయారు. ఈత వచ్చిన వారు తమ ప్రాణాలను నిలుపుకోడానికి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.
Read Also: Bhagat Singh Drama: బాలుడి ప్రాణం తీసిన భగత్‌సింగ్ నాటకం.. ప్రాక్టీస్ చేస్తూ మృతి
అయితే బ్రిడ్జి ఆధునీకరణ పనుల కోసం ఆరునెలలుగా వంతెన పైకి సందర్శకులను అనుమతించలేదు. పనులు పూర్తి చేసిన తర్వాత ఐదు రోజులనుంచి సందర్శకులను అనుమతించారు. ఆదివారం సాయంత్రం ఎక్కువ మంది నడవడంతో పాటు జనసాంద్రత తట్టుకోలేక కూలినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 141 మంది దుర్మరణం పాలయ్యారు. 177 మందిని రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. ఆచూకీ లేని వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఈ ప్రమాదంలో బీజేపీ రాజ్ కోట్ ఎంపీ మోహన్ భాయ్ కల్యాణ్ జీ కుందారియా సోదరి తరపు బంధువులు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని కన్నీటిపర్యంతం అయ్యారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.