NTV Telugu Site icon

114Year Old Teak Tree : బ్రిటీష్ వాళ్లు నాటిన చెట్టు.. దాని ధర తెలిస్తే షాకే

Teak

Teak

114Year Old Teak Tree : కేరళ రాష్ట్రంలో ఓ టేకు చెట్టు రికార్డు స్థాయి ధర పలికింది. దాదాపు 114ఏళ్ల వయసు గల ఆ చెట్టు వేలంలో రూ.40లక్షల ధరకు చేజిక్కించుకున్నారు. ఈ చెట్టును నిలంబూరు టేకు ప్లాంటేషన్‌లో బ్రిటిష్‌వారు 114 ఏళ్ల క్రితం నాటారని అటవీ శాఖ సిబ్బంది పేర్కొంది. 1909లో నాటిన చెట్టు ఎండిపోయి, పరిరక్షణ ప్లాట్‌లో దానంతటదే పడిపోవడంతో అటవీ శాఖ సిబ్బంది సేకరించారు. పరిరక్షణ ప్లాట్లలోని టేకు చెట్లు వాటంతట అవే పడిపోయిన తర్వాతే వాటిని సేకరిస్తారని ఆ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.

Read Also: Dasara: ఎట్లైతే గట్లయ్యింది… దేశం మొత్తం మన సౌండ్ వినపడాలే…

ఈ టేకు చెట్టును నెడుంకాయం ఫారెస్ట్ డిపోలో వేలానికి ఉంచారు. బృందావన్ టింబర్స్ యజమాని అజీష్ కుమార్ ఫిబ్రవరి 10న తుది ధర రూ. 39.25 లక్షలకు వేలంలో గెలుచుకున్నారు. 8 క్యూబిక్ మీటర్ల మందం ఉన్న కలపను మూడు ముక్కలుగా వేలం వేశారు. 3 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న ప్రధాన ముక్క రూ.23 లక్షలు పలికింది, అదే చెట్టులోని మిగిలిన రెండు ముక్కలు వరుసగా రూ.11 లక్షలు, రూ.5.25 లక్షలకు చేరాయి. నెడుంకాయ డిపో అధికారి షరీఫ్‌ చెట్టుకు రికార్డు స్థాయిలో ధర లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.

Read Also: Akshay Kumar: సాంగ్ లాంచ్ చేస్తూ గిన్నీస్ బుక్ రికార్డ్ క్రియేట్ చేశాడు

నిలంబూరు టేకు అంతర్జాతీయ బ్రాండ్ కలిగిఉంది. ప్రపంచంలో, టేకు తోటల పెంపకం మొదట నిలంబూరులో జరిగింది. మూడు మీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ఒక ముక్క లభించే అవకాశాలు చాలా అరుదు. కలపను తిరువనంతపురం తరలించేందుకు లారీపై లోడ్ చేసేందుకు అదనంగా రూ.15,000 చెల్లించాల్సి వచ్చింది. రికార్డు ధర పలికిన ఈ అరుదైన చెక్క ముక్కను లోడ్ చేయడానికి చాలా మంది స్థానికులు వచ్చారు.