Site icon NTV Telugu

Leopard Attack: శభాష్ బేటా.. చిరుతతో పోరాడిన 11 ఏళ్ల బాలుడు..

Leopard Attack

Leopard Attack

Leopard Attack: పొరపాటు మీకు చిరుతపులి ఎదురైతే ఏం చేస్తారు.. పరుగో పరుగు అంటారు కదా. కానీ ఒక చిన్నపిల్లవాడు ధైర్యంగా చిరుతతో పోరాడిన తీరును చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకీ ఆ చిన్నారి వయసు ఎంతో తెలుసా.. కేవలం 11 ఏండ్లు మాత్రమే. ఇంత చిన్న ప్రాయంలో ఎదురుగా మృత్యదేవతలా చిరుత ఉంటే అంత ధైర్యంగా పోరాడటం నిజంగా ఆశ్చర్యకరమే. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. ఆ చిన్నారికి చిరుత దాడిలో ఏమైనా గాయాలు అయ్యాయా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Bhagyashri Borse : అందమా, లక్కా.. త్వరలో తేలనుంది!

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలోని కాంచడ్‌ ప్రాంతంలో పదకొండేళ్ల కువారా అనే బాలుడు పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా వెనుక నుంచి చిరుతపులి దాడి చేసింది. తాను వేసుకున్న బ్యాగ్‌పై చిరుత పంజా విసిరిన వెంటనే అప్రమత్తమైన బాలుడు గట్టిగా కేకలు వేస్తూ.. తన స్నేహితుడితో కలిసి ఆ చిరుతపై ఎదురు దాడి చేయడం ప్రారంభించారు. ఆ చిన్నారి రాళ్లను చిరుతపులిపై విసరడం, అలాగే ఆ చిన్నారి తోటి స్నేహితులు కేకలు విని దగ్గర్లోని ప్రజలు కర్రలు, రాళ్లతో పరిగెత్తి రావడం చూసిన చిరుత వెంటనే అడవిలోకి పారిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చిరుత దాడి చేసినప్పుడు కూడా భయపడకుండా ధైర్యం, సమయస్ఫూర్తితో దానిని తరిమికొట్టిన కువారాను అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. చిరుతపులిని గుర్తించడానికి కెమెరా ట్రాప్‌లను, థర్మల్ డ్రోన్‌లను ఉపయోగిస్తున్నామని, బోన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. చిరుత దాడిలో కువారా చేతికి గాయం కావడంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. వాస్తవానికి చిరుత దాడి సమయంలో విద్యార్థి స్కూల్‌ బ్యాగ్‌ వేసుకొని ఉండడం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్పారు.

READ ALSO: Muslim Countries: ఇస్లాంలో మద్యం నిషేధం.. అయినా ఈ ముస్లిం దేశాలలో..

Exit mobile version