Site icon NTV Telugu

Jagtial: గణేశ్ నిమజ్జన ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్‌లు..

Transgenders

Transgenders

జగిత్యాల జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జనోత్సవం బందోబస్తు లో ట్రాన్స్‌జెండర్‌ల చే ట్రాఫిక్ నియంత్రణ చేపట్టిన పోలీస్ లు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ప్రజా సేవా కార్యక్రమ బాధ్యతల్లో ట్రాన్స్‌జెండర్‌లను చేర్చిన రెండవ జిల్లా జగిత్యాల నిలిచింది. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు మాట్లాడుతూ….“గణేశ్ నిమజ్జన బందోబస్తులో ట్రాన్స్‌జెండర్‌లను భాగస్వామ్యం చేయడం వల్ల సమాజంలో ప్రతి వర్గానికీ గౌరవం, మర్యాద, సమానత్వం అందించే మంచి సందేశం వెళ్తుంది అని పేర్కొన్నారు.

Also Read:John Abraham : ఫోర్స్ -3లో హీరోయిన్ గా టాలీవుడ్ సొగసుల సుందరి

తమదైన జీవనశైలిలో ఉండే వీరికి సమాజంలో వివక్షను పోగొట్టడానికి ట్రాఫిక్ విధుల్లోకి తీసుకోవడం జరిగింది అని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో 11 మంది ట్రాంజెండర్లు ట్రాఫిక్ విధులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఇలాంటి బాధ్యతల్లో ట్రాన్స్‌జెండర్‌లను చేర్చిన రెండవ జిల్లా జగిత్యాలగా నిలిచిందని అన్నారు.

Exit mobile version