సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరంలో తాగుబోతు 108 సిబ్బందికి చుక్కలు చూపించాడు. తీవ్ర జ్వరం వచ్చిందని, హాస్పిటల్ కి వెళ్లాలని 108కు ఫోన్ చేశాడు పరుశరాములు. చెప్పిన అడ్రస్ కు వచ్చిన 108 సిబ్బంది.. రాగానే ఫోన్ చేయగా.. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళనకు గురయ్యారు 108 సిబ్బంది. 108 సిబ్బంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ కట్ చేయడంతో బాధితుడి కోసం ఆరా తీశారు 108 సిబ్బంది. ఫోన్ చేసిన సదర్ కాలర్ ను వెతికే ప్రయత్నం చేయగా… పరుశరాములు బెల్ట్ షాపులో తాపీగా మద్యం సేవిస్తూ దర్శనమిచ్చాడు. దీంతో షాక్ కు గురైన 108 సిబ్బంది.. మందు బాబు పరుశరాములు తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
Minister Seethakka : పండగపూట రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారు
