NTV Telugu Site icon

Rs 2,000 notes: రూ.2 వేల నోట్లపై అసలు విషయం బయటపడింది..!

2000 Notes

2000 Notes

నకిలీ నోట్ల భరతం పట్టేందుకు, బ్లాక్‌ మనీని వెలికి తీయడమే లక్ష్యంగా డీమానిటైజేషన్‌కు శ్రీకారం చుట్టింది నరేంద్ర మోడీ సర్కార్.. అప్పటి వరకు పెద్ద నోట్లుగా చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది.. ఆ తర్వాత మొదట రూ.2 వేల నోట్లను తీసుకొచ్చింది… ఆ తర్వాత మళ్లీ కొత్త హంగులతో రూ. 500 కరెన్సీ నోట్లను కూడా తెచ్చింది.. అయితే, మొదట్లో రూ.2 వేల నోట్లు బాగా చలామణిలో ఉన్నా.. ఆ తర్వాత ప్రింటింగ్‌ను తగ్గించింది రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా.. అంతే కాదు.. రూ.2 వేల నోటను కూడా రద్దు చేస్తారనే ప్రచారం జరిగింది.. ఒక్కటి కాదు.. రోజులో తరహాలో భారతీయ కరెన్సీలో ఉన్న అతిపెద్ద నోటుపై పుకార్లు షికార్లు చేశాయి.. అయితే, కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం డీమానిటైజేషన్ లక్ష్యం నెరవేరలేదు అనేది స్పష్టమైంది.. లోక్ సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ.. రూ. 2 వేల నోట్ల గురించి కీలక విషయాన్ని వెల్లడించారు.. 2016 నుంచి చూస్తే 2020 వరకు దేశంలో ఫేక్ రూ. 2 వేల నోట్లు భారీగా పెరిగిపోయాయని.. అవి ఎంతలా అంటే.. ఏకంగా 107 రెట్లు పెరిగాయని ప్రకటించారు.

Read Also: Indian Army: ఆర్మీలో ఖాళీలపై కేంద్రం ప్రకటన.. డిసెంబర్ 2023 నాటికి భర్తీ..

ఏ ఏడాదిలో ఫేక్‌ నోట్లను ఎలా సీజ్‌ చేసిన విషయాన్ని లోక్‌సభలో ప్రస్తావించిన పంకజ్‌ చౌదరి.. 2016లో 2,272 ఫేక్ రూ.2 వేల నోట్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. 2017లో ఆ సంఖ్య 74,898కు చేరిందని.. 2018లో 54,776 ఫేక్ రూ.2 వేలు నోట్లను సీజ్ చేశారు. ఇక 2019లో వీటి సంఖ్య 90,566గా, 2020లో ఏకంగా 2,44,834గా ఉందని పేర్కొన్నారు.. రూ. 2 వేల నకిలీ నోట్ల 2016 నుంచి పెరుగుతూ వచ్చాయని.. కానీ, 2018లో అది మాత్రం కాస్త తగ్గాయని.. అయితే ,అటుపై మళ్లీ ఫేక్ నోట్లు భారీగా పెరిగాయి. 2019 నుంచి 2020 మధ్య కాలంలో ఫేక్ రూ.2 వేల నోట్ల ఏకంగా 170 శాతం పెరగడం కలకలం సృష్టిస్తోంది.. అయితే 2018-19 నుంచి 2020-2021 వరకు చూస్తే బ్యాంకుల్లోకి వచ్చే రూ. 2 వేల నోట్లలో ఫేక్ నోట్లు తగ్గాయని.. 2021-22లో ఈ సంఖ్య 13,604గా ఉందని తెలిపారు పంకజ్‌ చౌదరి.

మొత్తంగా నోట్ల రద్దు తర్వాత ఫేక్‌ కరెన్సీ మార్కెట్ జోరు కొనసాగుతోంది… 2016 నుంచి 2020 మధ్యకాలంలో రూ.2000 నకిలీ కరెన్సీ నోట్ల సంఖ్య 107 రెట్లు పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక, నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల (FICN) చెలామణిని అరికట్టడానికి, ప్రభుత్వం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967ను రూపొందించింది, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)ని ఏర్పాటు చేసింది.. భద్రత మధ్య నిఘా మరియు సమాచారాన్ని పంచుకోవడానికి FICN కోఆర్డినేషన్ గ్రూప్ (FCORD)ని ఏర్పాటు చేసింది. రాష్ట్రాలు మరియు కేంద్రం యొక్క ఏజెన్సీలు. టెర్రర్ ఫండింగ్ మరియు ఫేక్ కరెన్సీ కేసులపై కేంద్రీకృత దర్యాప్తు చేయడానికి NIAలో టెర్రర్ ఫండింగ్ మరియు ఫేక్ కరెన్సీ (TFFC) సెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు కేంద్రమంత్రి పంకజ్‌ చౌదరి..

Show comments