Site icon NTV Telugu

Sudan Landslide: సూడాన్‌లో విరిగిపడిన కొండచరియలు.. శవాల దిబ్బగా మారిన గ్రామం.. 1,000 మంది మృతి

Sudan

Sudan

ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంతంటి విధ్వంసం జరుగుతుందో ఇలీవలి జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే తెలిసిపోతుంది. నిన్న ఆఫ్ఘనిస్థాన్ లో భూకంపం కారణంగా వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది మరువకముందే ఆఫ్రికన్ దేశమైన సూడాన్‌లో ప్రకృతి ఉగ్ర రూపందాల్చింది. సూడాన్ లో కొండచరియలు విరిగిపడి 1,000 మంది మరణించారని సూడాన్ లిబరేషన్ మూవ్‌మెంట్/ఆర్మీ తెలిపింది. ఈ కొండచరియ పశ్చిమ సూడాన్‌లోని మర్రా పర్వత ప్రాంతంలోని ఒక గ్రామాన్ని పూర్తిగా నాశనం చేసింది. గ్రామంలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ గ్రామం ఇప్పుడు పూర్తిగా నేలమట్టమైందని సైన్యం తెలిపింది. గ్రామం శవాల దిబ్బగా మారిందని తెలిపారు.

Also Read:Off The Record : కామారెడ్డి BJP ఎమ్మెల్యే వెంకట రమణ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు

అబ్దేల్‌వాహిద్ మొహమ్మద్ నూర్ నేతృత్వంలోని బృందం ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. చాలా రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆగస్టు 31న కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపింది. డార్ఫర్ ప్రాంతంలో ఉన్న ప్రాంతాన్ని ఈ ఉద్యమం/సంఘం నియంత్రిస్తుంది. పురుషులు, మహిళలు, పిల్లలు సహా మృతుల మృతదేహాలను వెలికి తీయడానికి సహాయం చేయాలని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సహాయ సంస్థలకు విజ్ఞప్తి చేసింది.

Exit mobile version